Laya : చూడ్డానికి చదువుకున్నవాడిలా ఉన్నాడు.. సినిమాల్లోకి ఎందుకు? త్రివిక్రమ్ గురించి లయ..
ప్రమోషన్స్ లో భాగంగా లయ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Laya Interesting Comments on Trivikram Srinivas
Laya : ఒకప్పటి హీరోయిన్ లయ మధ్యలో పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమయి అమెరికాకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత లయ రీ ఎంట్రీ ఇస్తుంది. నితిన్ తమ్ముడు సినిమాతో లయ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా జులై 4 రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా లయ పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
త్రివిక్రమ్ రచయితగా పనిచేసిన మొదటి సినిమా స్వయంవరం. ఆ సినిమాతోనే లయ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. త్రివిక్రమ్ తో పనిచేయడం గురించి అడగ్గా లయ మాట్లాడుతూ.. స్వయంవరం సమయంలో చూడటానికి బాగా చదువుకున్నవాడిలా ఉన్నాడు, సినిమా ఫీల్డ్ లోకి ఎందుకొచ్చాడు అని నాలో నేనే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఆయన టాప్ డైరెక్టర్ అయ్యాడు. రచయితగా త్రివిక్రమ్ రాసిన మొదటి డైలాగ్స్ ని పలికే అదృష్టం నాకు దక్కింది. మరోసారి అవకాశం వస్తే త్రివిక్రమ్ తో కలిసి పనిచేస్తాను అని తెలిపింది. మరి త్రివిక్రమ్ లయకు తన రాబోయే సినిమాల్లో ఛాన్స్ ఇస్తాడా లేదా చూడాలి.
Also Read : Klin Kaara : పులి పిల్లకు చరణ్ కూతురు ‘క్లిన్ కారా’ పేరు.. ఉపాసన స్పెషల్ పోస్ట్ వైరల్..
అలాగే లయ.. తన చేతిలో ఉన్న సినిమాలని పూర్తిచేసేసి మళ్ళీ అమెరికాకు వెళ్లిపోతానని, మంచి అవకాశాలు వస్తే హైదరాబాద్ వచ్చి నటిస్తానని తెలిపింది. తమ్ముడు సినిమా రిలిజ్ తర్వాత లయకు ఏ రేంజ్ లో అవకాశాలు వస్తాయో చూడాలి.