Taapsee Pannu : ఆ ఆటగాడితో డేటింగ్ విషయంలో వాస్తవాలు చెప్పిన నటి

'ఝమ్మంది నాదం'తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తాప్సీ బాలీవుడ్‌లో బిజీ నటి అయ్యారు. తాజాగా ఓ ఆటగాడితో డేటింగ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.

Taapsee Pannu : ఆ ఆటగాడితో డేటింగ్ విషయంలో వాస్తవాలు చెప్పిన నటి

Taapsee Pannu

Updated On : January 19, 2024 / 12:22 PM IST

Taapsee Pannu : 2010 లో ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు తాప్సీ. తెలుగు, హిందీ, తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా మారారు. ఎప్పటి నుండో తాప్సీకి, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోకి మధ్య ప్రేమాయణం నడుస్తోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వని తాప్సీ తాజాగా అసలు విషయాలు చెప్పారు.

Yatra 2 Song : యాత్ర 2 నుంచి చూడు నాన్న అంటూ ఎమోషనల్ సాంగ్ రిలీజ్..

కె.రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ‘ఝమ్మంది నాదం’తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు తాప్సీ. 2013 లో ‘చష్మే బద్దూర్’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీగా మారారు.అయితే కొంతకాలంగా తాప్సీ డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బో లవ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై తాప్సీ పెదవి విప్పలేదు. తాజాగా ఈ నటి ఈ విషయం వాస్తవమేనని వెల్లడించారు. తను బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లోనే మాథిస్ బోతో ప్రేమలో పడ్డానని ఒప్పుకున్నారు. పదేళ్లుగా తమ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉందని.. ఇద్దరం సంతోషంగా ఉన్నామని చెప్పారు. ప్రేమ, పెళ్లి విషయంలో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండటం వల్లే ఈ విషయం రివీల్ చేయలేదని వెల్లడించారు తాప్సీ.

Matka Opening Bracket : వరుణ్ తేజ్ ‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్.. ఈ సారి పాన్ ఇండియా ప్రామిస్..

తాప్సీ ఇండస్ట్రీకి వచ్చి 13 సంవత్సరాలు అవుతోంది. తెలుగులో వస్తాడు నా రాజు, మిస్టర్ పెర్ఫెక్ట్, వీర, మొగుడు, గుండెల్లో గోదారి, దరువు, షాడో వంటి సినిమాల్లో పనిచేశారు. ఇటీవల బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2023 లో షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన ‘డంకీ’ సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం వహ్ లడ్‌కీ హై కహా, ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా, ఖేల్ ఖేల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇక మాథిస్ బోతో తాప్సీ ఎప్పుడు ఏడడుగులు వేస్తారో? ప్రకటించాల్సి ఉంది.