Matka Opening Bracket : వరుణ్ తేజ్ ‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్.. ఈ సారి పాన్ ఇండియా ప్రామిస్..

నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మట్కా ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఓ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

Matka Opening Bracket  : వరుణ్ తేజ్ ‘మట్కా’ గ్లింప్స్ రిలీజ్.. ఈ సారి పాన్ ఇండియా ప్రామిస్..

Varun Tej Pan India Movie Matka Opening Bracket Glimpse Released

Updated On : January 19, 2024 / 11:48 AM IST

Matka Opening Bracket : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej) దర్శకుడు కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్‌డ్రాప్‌తో మట్కా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో ఉండబోతుందని సమాచారం. వైరా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో భారీగా పాన్ ఇండియా సినిమాగా మట్కా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

Also Read : Director Vasishta : కళ్యాణ్ రామ్ ఒప్పుకున్నాకే చిరంజీవి సినిమా చేస్తున్నాను.. బింబిసార 2 నేను డైరెక్ట్ చెయ్యట్లేదు..

తాజాగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. నేడు వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మట్కా ఓపెనింగ్ బ్రాకెట్ అంటూ ఓ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ గ్లింప్స్ తో మట్కా మాస్ యాక్షన్ గా ఉండబోతుందని తెలుస్తుంది. అలాగే వరుణ్ తేజ్ చాలా స్టయిలిష్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మట్కా గ్లింప్స్ వైరల్ గా మారింది. ఈ సినిమా వరుణ్ తేజ్ కి మొదటి పాన్ ఇండియా సినిమా కానుంది.