Vani Bhojan
Vani Bhojan : ‘మీకు మాత్రమే చెప్తా’ అనే తెలుగు సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు వాణీ భోజన్. ‘ఓ మై కడవులే’ అనే తమిళ సినిమాతో తమిళనాట బిజీ స్టార్ అయిపోయారు. రీసెంట్‌గా ఈ నటి దళపతి విజయ్ పార్టీ గురించి.. రాజకీయాల పట్ల తనకున్న ఆసక్తిని మీడియాతో షేర్ చేసుకున్నారు.
KK Senthil Kumar : ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య మరణం..
టీవీ నటిగా కెరియర్ మొదలుపెట్టిన వాణీ భోజన్ తర్వాత వెండితెరపై హీరోయిన్‌గా బిజీ అయిపోయారు. ‘ఓ మై కడవులే’ తో మొదలైన ఆమె కెరియర్‌లో లాకప్, రామే ఆండాలుమ్ రావణనే ఆండాళుమ్, పాయుమ్ అని నీ వెనక్కు.. అనే సినిమాలు చేసారు. తమిళ ‘రాకర్స్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించారు. ఆర్యన్, క్యాసినో, పగైవనుక్కూ అరుళ్వాయ్ అనే సినిమాలతో వాణీ భోజన్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ నటి దళపతి విజయ్ రాజకీయ పార్టీ గురించి మాట్లాడారు. అలాగే తనకు రాజకీయాల పట్ల ఉన్న ఆసక్తిని వెల్లడించారు.
మంచి చేయాలనుకుంటే ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని.. విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని తాను స్వాగతిస్తున్నానని వాణీ భోజన్ అన్నారు. విజయ్‌కి ఒక అవకాశం ఇద్దామని.. ఏం చేస్తారో చూద్దామని చెప్పారు. తాను కూడా ‘సెంగళం’ అనే వెబ్ సిరీస్‌లో పొలిటీషయన్ పాత్రలో నటించానని.. అప్పటి నుండి రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి కలిగిందని.. ఇంకా తనకు రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉందని వాణీ భోజన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Vishwak Sen : విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి.. నాగచైతన్య హీరోగా సెలెక్ట్.. ఏ మూవీ..?
విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన పార్టీ 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయదని.. 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు విజయ్ చెప్పారు. తన 69వ సినిమా తర్వాత ఇక సినిమాల్లో నటించనని కూడా విజయ్ ప్రకటించారు. విజయ్ ‘లియో’ సినిమా తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి వాణీ భోజన్ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.