Fear Movie : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న వేదిక.. సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’తో..

తెలుగులో కొన్ని సినిమాల్లో నటించిన హీరోయిన్ వేదిక.. ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'ఫియర్'తో రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Fear Movie : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న వేదిక.. సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’తో..

Actress Vedhika re entry with fear movie opening happened in hyderabad

Updated On : January 17, 2024 / 4:04 PM IST

Fear Movie : హీరోయిన్ వేదిక తెలుగులో ముని, విజయదశమి, బాణం, కాంచన.. లాంటి పలు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రెగ్యులర్ గా సినిమాలు చేసి మెప్పించింది వేదిక. సోషల్ మీడియాలో కూడా రెగ్యులర్ గా ఫోటోలు పోస్ట్ చేస్తూ యాక్టివ్ గా ఉంటుంది. తెలుగులో చివరి సారిగా 2019లో రూలర్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో ఓ పాటలో మెరిపించింది. ఇప్పుడు మళ్ళీ అయిదేళ్ల తర్వాత మెయిన్ లీడ్ లో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది వేదిక.

వేదిక మెయిన్ లీడ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో ‘ఫియర్’ అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా నుంచి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వేదిక ఫియర్ సినిమాని దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ఏఆర్ అభి నిర్మిస్తుండగా సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. మహిళా దర్శకురాలు హరిత గోగినేని ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. నటుడు అరవింద్ కృష్ణ ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ లో నటించనున్నారు.

ఫియర్ సినిమా పూజా కార్యక్రమంలో సీనియర్ నటుడు మురళీ మోహన్ పాల్గొని స్క్రిప్ట్ అందించగా, డైరెక్టర్ కరుణాకరన్ క్లాప్ కొట్టారు. అలాగే డైరెక్టర్ తేజ కాకుమాను, హీరో సోహైల్.. పలువురు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సినిమాలో వేదిక, అరవింద్ కృష్ణలతో పాటు జయప్రకాష్, పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, షాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని.. పలువురు నటించబోతున్నారు. పూజా కార్యక్రమం అనంతరం చిత్రయూనిట్ మీడియాతో మాట్లాడారు.

Also read : Sreeleela : మహేష్‌తో సినిమా చేస్తుందని తెలిసి.. ముంబైలోని కాలేజీ శ్రీలీలకి ఎక్స్‌ట్రా మార్కులు వేశారట..

హీరోయిన్ వేదిక మాట్లాడుతూ.. ఫియర్ మూవీ షూటింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయి. నేను తెలుగులో కాంచన, రూలర్.. లాంటి పలు సినిమాల్లో నటించినా సస్పెన్స్ థ్రిల్లర్ కథలో నటించలేదు. డైరెక్టర్ హరిత గోగినేని ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ స్క్రిప్ట్ తో వచ్చి నాకు కథ చెప్పినప్పుడు ఓకే చెప్పాను. ఈ నిర్మాణ సంస్థ, మహిళా దర్శకురాలితో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా మీకు నచ్చుతుంది అని తెలిపింది.

fear movie

దర్శకురాలు డైరెక్టర్ హరిత గోగినేని మాట్లాడుతూ.. డైరెక్షన్ నా డ్రీమ్ కాదు డెస్టినీ అని ఫీల్ అవుతాను. నేడు ఫియర్ సినిమా ప్రారంభం కావడం హ్యాపీగా ఉంది. ఏడాది పాటు ఆలోచించి ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ కథకి వేదిక లాంటి హీరోయిన్ దొరకడం సంతోషంగా ఉంది. టీం సహాయంతో ఇన్ టైమ్ లో సినిమా తీసి ప్రేక్షకులకు నచ్చేలా స్క్రీన్ మీదకు తీసుకొస్తాను అని తెలిపింది.

నిర్మాత ఏఆర్ అభి మాట్లాడుతూ.. దర్శకురాలు హరిత నా వైఫ్. మా సంస్థలో వచ్చిన లక్కీ లక్ష్మణ్ సినిమాకు పని చేసింది. ఆ సినిమాకు చాలా క్రాప్ట్స్ కి సూపర్ విజన్ చేసేది. డైరెక్షన్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయగలదు అని నమ్మకం ఉంది. ఫియర్ స్క్రిప్ట్ చాలా బాగా రాసుకుంది. ఆ కథని ఓకే చేసి సపోర్ట్ చేస్తున్న వేదిక గారికి థ్యాంక్స్. హీరో అయినా అరవింద్ కృష్ణ స్పెషల్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు అని తెలిపారు.