Arabic Kuthu-Vedhika: హలమితి హబిబో పాటకి వేదిక డాన్స్.. వీడియో వైరల్
కోలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా అరబిక్ కుత్తు పాటే వినిపిస్తుంది. దళపతి విజయ్ బీస్ట్ సినిమా నుండి విడుదలైన ఈ లిరికల్ వీడియో సాంగ్ కు భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఏకంగా వంద..

Arabic Kuthu Vedhika
Arabic Kuthu-Vedhika: కోలీవుడ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా అరబిక్ కుత్తు పాటే వినిపిస్తుంది. దళపతి విజయ్ బీస్ట్ సినిమా నుండి విడుదలైన ఈ లిరికల్ వీడియో సాంగ్ కు భారీ రెస్పాన్స్ దక్కించుకుంది. ఏకంగా వంద మిలియన్ వ్యూస్ దక్కించుకున్న ఈ పాట సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూనే ఉంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఈ పాటతో రీల్స్ చేసి పోస్టులు చేస్తుంటే.. హీరోయిన్లే ఈ పాటకి స్టెప్పులేసి వీడియోలు తెచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు.
Kalavathi-Arabic Kuthu: మహేష్ 50 మిలియన్.. విజయ్ 100 మిలియన్ వ్యూస్!
ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా ఇదే పాట. విజయ్ హీరోగా నటించిన ‘బీస్ట్’లోని ఈ పాట ఇప్పుడు ఇంటర్నెట్‌నే షేక్ చేస్తోంది. ఆ మధ్య స్టార్ హీరోయిన్ సమంతా పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా సమంతా ఒక్కటే కాదు ఇంకా కొందరు హీరోయిన్స్ కూడా ఈ పాటకి స్టెప్పులేయగా సౌత్ హీరోయిన్ వేదిక ఏకంగా బీచ్ లో ఈ పాటకి స్టెప్పులేస్తూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Vedhika: సొగసుల గాలమేస్తున్న వేదిక!
ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాల్దీవ్ టూర్లలో హల్చల్ చేస్తున్న ఈ భామ.. ఇప్పుడు కూడా మరోసారి మాల్దీవుల్లో ఎంజాయ్ చేసేందుకు వెళ్లినట్లుగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లను షాక్‌కు గురిచేస్తోన్న ఈ సౌత్ హీరోయిన్ తాజాగా షార్ట్ డ్రెస్ లో అరబిక్ కుతు పాటకి ఇరగగీస్తూ స్టెప్పులేసింది. వేదిక డాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
View this post on Instagram