Swapna Chowdary
Swapna Chowdary : బిగ్ బాస్ షోలో పాల్గొనడం అంటే ఆ నటికి విపరీతమైన క్రేజ్. దానిని క్యాష్ చేసుకుని ఆమెను చీట్ చేసాడు ఓ వ్యక్తి. మోసపోయిన సదరు నటి పోలీసులను ఆశ్రయించింది.
Venkatesh : అలనాటి హీరోయిన్స్‌తో వెంకీ మామ ‘అల్లుడా మజాకా’.. సంక్రాంతి పండక్కి..
బిగ్ బాస్ షో అంటే జనాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇక అందులో పార్టిసిపేట్ చేయడానికి తహతహలాడే సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్న చౌదరి ఒకరు. నమస్తే సేట్ జీ, మిస్టరీ సినిమాలతో నటిగా మారిన ఆమె ఈవెంట్స్ లో యంకరింగ్ కూడా చేస్తారు. స్వప్న చౌదరికి బిగ్ బాస్ షోలో పాల్గొనడం డ్రీమ్ అట. దీనిని క్యాష్ చేసుకుని రూ.2.50 లక్షలు టోపీ పెట్టాడు తమ్మలి రాజు అనే వ్యక్తి. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
స్వప్న చౌదరి బిగ్ బాస్ సీజన్ 1 మొదలైన దగ్గర్నుండి ఫాలో అవుతూ వచ్చారట. పగలు, రాత్రి ఆ షోలో పాల్గొనాలని కలలు కంటూ వచ్చారట. కాగా బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పంపిస్తానని నమ్మించి తమ్మలి రాజు అనే వ్యక్తి ఆమె దగ్గర రూ.2.50 లక్షలు డబ్బులు వసూలు చేసాడట. ఆ డబ్బులతో బిగ్ బాస్ లో ధరించాల్సిన కాస్ట్యూమ్స్ పంపిస్తానని మాటిచ్చాడట. అంతే కాకుండా ఫోటో షూట్ కోసం మరో రూ.25 వేలు తీసుకున్నాడట. ఇవన్నీ నోటి మాటలతో కాదు అగ్రిమెంట్ పేపర్ మీద రాసి సంతకం చేసి మరీ ఇచ్చాడు. దాంతో స్వప్న చౌదరి బిగ్ బాస్ లోకి వెళ్లడం ఖాయమని డిసైడ్ అయిపోయారు.
Sailesh Kolanu : ‘నువ్వు నాకు నచ్చావు’ ప్రేయర్ చేసిన డైరెక్టర్ శైలేష్.. చెత్తగా ఉందన్న వెంకటేష్..
కట్ చేస్తే బిగ్ బాస్ షో సంగతి దేవుడెరుగు.. కాల్ చేస్తే ఫోన్ కూడా ఎత్తడం మానేశాడు సదరు వ్యక్తి. ఆ తర్వాత రెస్పాండ్ అయినా ఏం చేసుకుంటావో చేస్కో అంటూ రివర్స్ లో మాట్లాడుతుండటంతో స్వప్నా చౌదరి మోసపోయానని అర్ధం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసారామె. కొసమెరుపు ఏంటంటే ఇంత జరిగినా బిగ్ బాస్ కల మాత్రం ఆమెలో అలాగే ఉంది. అవకాశం వస్తే నెక్ట్స్ సీజన్ లో తాను పాల్గొనేందుకు సిద్ధం అంటున్నారు ఆమె. బయట జరుగుతున్న మోసాల గురించి ఎంతో అవగాహన ఉన్న సెలబ్రిటీలు సైతం ఇటీవల కాలంలో ఇలా మోసపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.