Megha Akash : బామ్మ చనిపోయిన బాధలో ఉన్నా షూటింగ్‌కి వెళ్లిన నటి

మేఘా ఆకాష్ నటించిన తమిళ సినిమా 'వడక్కుపట్టి రామసామి' ఫిబ్రవరి 2 న రిలీజ్ అవుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా ఆడియో ఆవిష్కణలో హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడారు.

Megha Akash : బామ్మ చనిపోయిన బాధలో ఉన్నా షూటింగ్‌కి వెళ్లిన నటి

Megha Akash

Updated On : January 28, 2024 / 1:04 PM IST

Megha Akash : మేఘా ఆకాష్ తమిళ, తెలుగు సినిమాల్లో పాపులర్ నటి. తాజాగా ‘వడక్కుపట్టి రామసామి’ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మేఘా ఆకాష్ బామ్మ చనిపోయారట. ఎంతో బాధలో ఉండి ఈ షూటింగ్ పూర్తి చేసారట ఈ నటి. చెన్నైలో రీసెంట్‌గా ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ జరిగింది.

Lavanya Tripathi : వైజాగ్ బీచ్‌లో చెత్త ఏరిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. ‘మిస్ పర్ఫెక్ట్’ ప్రమోషన్స్ మాములుగా లేవుగా..

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ తమిళంలో నిర్మిస్తున్న సినిమా ‘వడక్కుపట్టి రామసామి’. కమెడియన్ సంతానం హీరో కాగా.. మేఘా ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ చెన్నైలో జరిగింది. ఈ సందర్భంలో నటి మేఘా ఆకాష్ ఈ సినిమాలో తనకి అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్‌కి ధన్యవాదాలు చెప్పారు. తను బామ్మ చనిపోయిన బాధలో షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు యూనిట్ మొత్తం అండగా నిలిచారని ఎమోషనల్ అవుతూ చెప్పారు మేఘా.

Hanuman – Eagle : ‘మాస్ మహారాజ’తో ‘హనుమాన్’ స్పెషల్ ఇంటర్వ్యూ చూశారా..? బోలెడన్ని ఆసక్తికర విషయాలు..
కార్తీక్ యోగీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. ఎంఎస్ భాస్కర్, కూల్ జయంత్ ఇతర పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ 65 రోజుల్లో పూర్తైందట. కాగా మేఘా ఆకాష్ గతంలో అబద్ధం, గుర్తుందా శీతాకాలం, రావణాసురుడు వంటి సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తెలుగులో ఒక కొత్త ప్రాజెక్టులో చేస్తున్నారు.