Adipurush Prabhas’s look: ప్రభాస్ రాముడి లుక్ ఎప్పుడంటే?

Adipurush Prabhas’s look: ప్రభాస్ రాముడి లుక్ ఎప్పుడంటే?

Adipurush Prabhas’s Ook

Updated On : March 24, 2021 / 4:51 PM IST

Adipurush: తెలుగు తెరపై యంగ్ హీరోల్లో రాముడు లుక్‌లో కనిపించిన హరోలే లేరు.. ఇప్పటివరకు అసలు అటువంటి సబ్జెక్ట్ జోలికి కూడా ఎవరూ పోలేదనే చెప్పవచ్చు. ఫస్ట్ టైమ్ బాహుబలి సినిమాతో భారీ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో రాముడుగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ రామాయణ కథ ఆధారంగా తెరకెక్కుతుండగా.. రాముడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తున్నాడు.

రాముడి పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే నెల(ఏప్రిల్) 21వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా రాముడి పాత్రకు సంబంధించి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించబోతుండగా.. సీత పాత్రలో కృతి సనోన్ నటిస్తోంది.

దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను 2022 ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా.. బాహుబలిగా విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ప్రభాస్.. పురాణ పాత్రల్లో ఎలా కనిపించబోతున్నారు అనేదానిపై ఆసక్తి నెలకొని ఉంది.