ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

  • Published By: vamsi ,Published On : November 19, 2020 / 07:29 AM IST
ప్రభాస్ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది

Updated On : November 19, 2020 / 10:32 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘ఆది పురుష్’. మైథలాజికల్ సబ్జెక్ట్‌తో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ విజువల్ గ్రాండియర్‌గా తెరకెక్కించబోతున్న ఈ సినిమాని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఇండియా వైడ్‌గా హాట్ టాపిక్ అయ్యింది. అందరికీ తెలిసిన రామాయణం కథాంశం కావడం, అందులో శ్రీరాముడు పాత్రలో ప్రభాస్ నటించడం అనేది ఆసక్తిగా అనిపిస్తుంది.



అయితే దీనిని ఓం రౌత్ ఎలా చెప్పబోతున్నాడు అనే క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఈ సినిమాలో విలనన్‌గా రావణుడు పాత్రకు సైఫ్ అలీఖాన్‌ని సెట్ చేశారు. లేటెస్ట్‌గా ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాను 11 ఆగస్ట్ 2022న విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించింది.



https://10tv.in/just-before-i-was-fined-for-no-helmet-taapsee/
ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సెలబ్రేటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఎవిల్ అనే క్యాప్షన్ ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా టాలీవుడ్, బాలీవుడ్ నటుల కలయికలో ఉండబోతుంది అనే విషయం అర్ధమైంది. ఇవాళ(19 నవంబర్ 2020) ఉదయం 7.11 గంటలకు ప్రభాస్‌.. తన ఇన్‌స్టాగ్రమ్ ద్వారా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)