Chusuko Video Song : హీరో హీరోయిన్స్ చేసిన ప్రైవేట్ సాంగ్ చూశారా..?

యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఇటీవల బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే..

Chusuko Video Song : హీరో హీరోయిన్స్ చేసిన ప్రైవేట్ సాంగ్ చూశారా..?

Adith Eswaran Aayushi Patell Chusuko Video Song

Chusuko Video Song : యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్, ఇండిపెండెంట్ సాంగ్స్ ఇటీవల బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలామంది యూట్యూబర్స్ సినిమా సాంగ్స్ రేంజ్ లో ఖర్చుపెట్టి మరీ ప్రైవేట్ సాంగ్స్ చేస్తున్నారు. తాజాగా హీరో హీరోయిన్స్ కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ ని అంతే రేంజ్ లో చాలా రిచ్ గా తీసారు.

పలు సినిమాలతో మెప్పించిన హీరో త్రిగుణ్, త్వరలో రాబోతున్న ‘కలియుగం పట్టణంలో’ హీరోయిన్ ఆయుషి పటేల్ ఇద్దరూ కలిసి ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. ‘చూసుకో నీలోకి..’ అంటూ సాగే ఈ పాట తాజాగా రిలీజయింది. ఈ పాటని సరిగమప చాంప్, సింగర్ యశస్వి కొండెపూడి, హరిణి ఇవటూరి కలిసి పాడారు. ఈ పాటని సురేష్ బాణిశెట్టి రాయగా అన్వేష్ రావు కగిటాల సంగీతం ఇచ్చారు.

Also read : Chandini Chowdary : సరికొత్తగా చిత్రకారుడితో టైటిల్ లాంచ్.. చాందిని చౌదరి కొత్త సినిమా ‘యేవమ్’..

ఈ పాటని కేరళలోని చాలా అందమైన లొకేషన్స్ లో అద్భుతమైన విజువల్స్‌లో తీశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతుంది. మీరు కూడా ఈ అందమైన పాటని చూసేయండి.