Chandini Chowdary : సరికొత్తగా చిత్రకారుడితో టైటిల్ లాంచ్.. చాందిని చౌదరి కొత్త సినిమా ‘యేవమ్’..
త్వరలో గామీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న చాందిని చౌదరి.. తన కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు.

Tollywood Actress Chandini Chowdary announce her new movie title
Chandini Chowdary : కలర్ ఫోటో సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న చాందిని చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. త్వరలో విశ్వక్ సేన్ అఘోరాగా నటిస్తున్న గామీ సినిమాతో రాబోతుంది. తాజాగా మరో కొత్త సినిమాని ప్రకటించింది చాందిని చౌదరి.
చాందినీ చౌదరి మెయిన్ లీడ్‌లో వశిష్ట, భరత్ రాజ్, అషు రెడ్డి.. ముఖ్యపాత్రలలో ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో నవదీప్ – పవన్ గోపరాజు స్థాపించిన C-Space నిర్మాణంలో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని ‘యేవమ్’ అని ప్రకటించారు. టైటిల్ తోనే సినిమాపై ఆసక్తి నెలకొంది.
Also read : Anupama Parameswaran : ఆ జంతువుని బహుమతిగా ఇస్తే.. నేను మీ సొంతం అంటున్న అనుపమ..
View this post on Instagram
అయితే సాధారణంగా ఇలాంటి అనౌన్సమెంట్ ప్రమోషన్స్ స్టార్స్ తో చేయిస్తారు. కానీ యేవమ్ యూనిట్ ప్రసిద్ధ చిత్రకారుడు, ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ లక్ష్మణ్ ఏలైతో ప్రత్యేకంగా పెయింట్ తో టైటిల్ లోగో చేయించి ఆవిష్కరించడం విశేషం. ఇక ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ అని తెలుస్తుంది. చాందిని చౌదరి త్వరలో గామీ, నెక్స్ట్ యేవమ్.. ఇలా ఢిఫెరెంట్ కథలతో రాబోతుంది.