Ashwatthama: ఆదిత్య ధర్ నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్.. వెయ్యి కోట్లతో ‘అశ్వథామ’.. హీరోగా తెలుగు స్టార్!
వెయ్యి కోట్లతో ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ(Ashwatthama) అనే భారీ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్.
Aditya Dhar next massive movie The Immortal Ashwatthama
- ఆదిత్య ధర్ డ్రీమ్ ప్రాజెక్ట్ లైన్ క్లియర్
- వెయ్యి కోట్లతో అశ్వథామ
- హాలీవుడ్ రేంజ్లో భారీ మైథో-సైన్స్ ఫిక్షన్
Ashwatthama: డైరెక్టర్ ఆదిత్య ధర్ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సంచలనంగా మారిపోయింది. ‘ధురంధర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన ఈ దర్శకుడు, రీసెంట్గా వచ్చిన ‘ధురంధర్ 2’తో మరోసారి తన సత్తా చాటారు. కేవలం మూడు రోజుల్లోనే ఈ రూ. 500 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. లాంగ్ రన్లో రూ. 2000 కోట్ల మార్కును సునాయాసంగా దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ భారీ విజయంతో ఆదిత్య ధర్(Ashwatthama) రేంజ్ నెక్స్ట్ లెవల్ కి చేరుకుంది. దీంతో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఏంటనేది ఇప్పుడు సినీ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ధురంధర్ తరువాత ఆదిత్య ధర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘ది ఇమ్మోర్టల్ అశ్వథామ’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది ఒక భారీ మైథో-సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. భారతీయ పురాణాల్లోని అశ్వథామ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Manchu Family: మంచు ఫ్యామిలీలో మళ్ళీ రచ్చ.. నిర్వాణ ఫంక్షన్లో విడివిడిగా అన్నదమ్ములు
ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగా, ఆధునిక కాలానికి అనుగుణంగా అద్భుతమైన కథను ఆయన సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమా బడ్జెట్ అక్షరాలా రూ.800 కోట్ల నుంచి రూ.1000 కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇంతటి భారీ వ్యయంతో రూపొందే ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో హీరోగా ఎవరు చేస్తారు అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేదా ‘ధురంధర్’ స్టార్ రణవీర్ సింగ్‌లలో ఒకరు ఈ భారీ సినిమాలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ ఇద్దరిలో ఎవరు అశ్వథామగా కనిపించినా, అది బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియన్ సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్‌కు తీసుకెళ్లేలా ఈ సినిమాను రూపొందించాలని ఆదిత్య ధర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
