Adivi Sesh: డెకాయిట్ హిట్ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన అడివి శేష్
డెకాయిట్ సినిమా సక్సెస్ తరువాత రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన అడివి శేష్(Adivi sesh).
Adivi Sesh hiked his remuneration after Dacoit movie success
- టాలీవుడ్ మోస్ట్ బ్యాంకబుల్ హీరో అడివి శేష్
- రెమ్యూనరేషన్ పెంచేసిన అడివి శేష్
- గూఢచారి 2 కోసం ఏకంగా లాభాల్లో వాటా
Adivi Sesh: అడివి శేష్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రయాణాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు టాలీవుడ్లో ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాంకబుల్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు ఈ హీరో. క్షణం, గూఢచారి, మేజర్, హిట్-2 వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఆయన మార్కెట్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన నటించిన ‘డెకాయిట్’ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో, శేష్ సినిమాలకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి సుమారు రూ.70 కోట్ల రూపాయల వరకు జరుగుతోంది.
Lik OTT: ‘Lik’ మూవీ ఓటీటీ న్యూస్.. అనుకున్న డేట్ కంటే ముందే.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ క్రమంలోనే శేష్ తన తదుపరి చిత్రాలకు రెమ్యూనరేషన్ భారీగా పెంచినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, అడివి శేష్(Adivi Sesh) ఇకపై ఒక్కో సినిమాకు రూ.20 నుండి రూ.25 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అడివి శేష్ త్వరలో సాయి మార్తాండ్ దర్శకత్వంలో చేయబోయే లవ్ స్టోరీ కోసం ఆయన సుమారు రూ.25 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు, ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘గూఢచారి 2’ దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ఆయన రెమ్యూనరేషన్ కాకుండా, ఏకంగా లాభాల్లో వాటాను తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ‘గూఢచారి 2’ భారీ హిట్ సాధించి రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా తోడైతే, వాటాల రూపంలో శేష్‌కు రూ.50 కోట్ల వరకు అందే అవకాశం ఉంది. కేవలం నటుడిగానే కాకుండా, తన సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మాణ వ్యయం తగ్గించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. నటనతో పాటు ఇతర క్రాఫ్ట్స్‌లోనూ ఆయన చూపిస్తున్న ప్రతిభను బట్టి, ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడంలో తప్పు లేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు అడివి శేష్ రెమ్యునరేషన్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
