After Balakrishna Urvashi Rautela will Do Special Songs in NTR and Ram Charan Movies Rumors goes Viral
Urvashi Rautela : బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో బాగా పాపులర్ అయి ఇక్కడ కూడా ఫాలోయింగ్ తెచ్చుకుంది. చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాలో మొదలుపెట్టి ఆ తర్వాత ఏజెంట్, బ్రో, స్కంద సినిమాల్లో తన సాంగ్స్ తో మెప్పించింది. ఇటీవల సంక్రాతికి బాలయ్య డాకు మహారాజ్ సినిమాలో కూడా దబిడి దబిడి స్టెప్పులతో అలరించింది.
తాజాగా టాలీవుడ్ లో మరో టాక్ వినిపిస్తుంది. ఊర్వశి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తుంది. ఇటీవలే ఎన్టీఆర్ – నీల్ సినిమా షూటింగ్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఓ షూటింగ్ ఫోటో కూడా రిలీజ్ చేసారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కి ఎన్టీఆర్ – నీల్ మూవీ యూనిట్ ఇప్పటికే ఊర్వశిని సంప్రదించినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో కూడా ఊర్వశి తన స్టెప్స్ తో అలరిస్తుందేమో చూడాలి.
Also Read : Hari Hara Veera Mallu Song : ‘హరిహర వీరమల్లు’ సెకండ్ సాంగ్ వచ్చేసింది.. పాట అదిరింది.. పవన్ డ్యాన్స్ సూపర్..
ఇక నిన్న ఇండియా – పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కి ఊర్వశి రౌటేలా వెళ్ళింది. మన స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు. దీంతో స్టేడియంలో ఊర్వశి – సుకుమార్ తో కలిసి మాట్లాడింది. సుక్కు మాస్టర్ చేతిలో చెయ్యేసి ఊర్వశి తెగ మాట్లాడేసింది. ఈ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో సుకుమార్ సినిమాలో కూడా ఊర్వశి ఐటెం సాంగ్ అడిగిందేమో అంటూ సరదాగా ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Hit 3 teaser : నాని బర్త్ డే.. అదిరిపోయిన హిట్-3 టీజర్.. యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్..
సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ RC17 సినిమా స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారు. సుకుమార్ సినిమాలో కచ్చితంగా ఐటెం సాంగ్ ఉంటుంది. మరి ఈ సినిమాలో ఊర్వశికి స్పెషల్ సాంగ్ ఇస్తారేమో చూడాలి. సుకుమార్ తో ఉన్న వీడియోని షేర్ చేసి.. మీరు సాధించిన విజయాలకు అభినందనలు. మీ తెలివి, డెడికేషన్ మమ్మల్ని ఎంతగానో ఇన్ స్పైర్ చేస్తాయి. మేము మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాము అని రాసుకొచ్చింది. దీంతో ఊర్వశి పోస్ట్ వైరల్ గా మారింది. మరి నెక్స్ట్ తెలుగులో ఎన్టీఆర్, చరణ్ ఎవరి సినిమాలో ఊర్వశి కనిపిస్తుందో చూడాలి.