Hit 3 teaser : నాని బర్త్ డే.. అదిరిపోయిన హిట్-3 టీజర్.. యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవల్..
నాచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 మూవీ టీజర్ విడుదలైంది.

Nani Hit 3 teaser out now
గతేడాది ‘సరిపోదా శనివారం’ మూవీ సాలీడ్ హిట్ అందుకున్నాడు నాచురల్ స్టార్ నాని. ఆయన నటిస్తున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. నాని కెరీర్‌లో 32వ చిత్రంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో చిత్రం కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
మే 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఫస్ట్ లుక్స్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇక నేడు (ఫిబ్రవరి 24) నాని పుట్టిన రోజు సందర్భంగా హిట్ -3 టీజర్‌ను విడుదల చేసింది.
Mumaith Khan : కొత్త బిజినెస్ లోకి ముమైత్ ఖాన్.. హైదరాబాద్ లో మేకప్ అండ్ హెయిర్ అకాడమీ..
యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ అని చెప్పాలి. నాని తన నటనతో అదరగొట్టాడు. మొత్తంగా టీజర్ అదిరిపోయింది.
ఈ చిత్రంలో నాని.. అర్జున్ సర్కార్‌గా కనిపించనున్నాడు. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోండగా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాని నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
కాగా.. గతంలో హిట్ సిరీస్‌లో రెండు చిత్రాలు వచ్చాయి. ఆ రెండు మూవీలు మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలకు కూడా శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. హిట్‌లో విశ్వక్ సేన్, హిట్-2లో అడివి శేష్ లు హీరోలుగా నటించారు. హిట్-3లో నాని నటిస్తున్నారు.