బాలీవుడ్ స్టార్ హీరోతో శంకర్ సైంటిఫిక్ థ్రిల్లర్!

ఇటీవల 2.0 అనే విజువల్ వండర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శంకర్ ప్రస్తుతం కమల్ హాసన్‌తో భారతీయుడు 2 చేస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతుంది. అయితే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ను తీయాలనుకుంటున్నాడట శంకర్. ఇండియన్ 2 చిత్రం తర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని అంటున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి శంకర్ విషన్, హృతిక్ యాక్టింగ్ స్కిల్స్ కలిస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి టెక్ మాంత్రికుడు భారీ హంగులతో ఈ సినిమాని కూడా తీర్చిదిద్దుతున్నారు. ఇక ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ కొన్ని కారణాల వల్ల షూటింగ్ కి బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.