Kushitha Kallapu : బాబోయ్ బోల్డ్ లుక్స్ తో ఆహా సిరీస్ లో ‘కుషిత కళ్లపు’.. గ్లింప్స్ వైరల్..

తాజాగా 3 రోజెస్ లో కొత్త రోజ్ అంటూ ఆహా కుషిత కళ్లపు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసింది.

Kushitha Kallapu : బాబోయ్ బోల్డ్ లుక్స్ తో ఆహా సిరీస్ లో ‘కుషిత కళ్లపు’.. గ్లింప్స్ వైరల్..

Aha Released 3 Roses Season 2 Kushitha Kallapu Role Glimpse

Updated On : April 29, 2025 / 6:20 PM IST

Kushitha Kallapu : ఆహా ఓటీటీలో గతంలో 3 రోజెస్ అనే బోల్డ్ సిరీస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈషారెబ్బ, పూర్ణ, పాయల్ రాజ్ పుత్.. ముగ్గురు మెయిన్ లీడ్స్ గా 2021లో వచ్చిన 3 రోజెస్ సిరీస్ మంచి హిట్ అయింది. ఇటీవలే ఈ సిరీస్ కి సీక్వెల్ ప్రకటించారు. తాజాగా ఈ సిరీస్ లో కొత్త రోజ్ అని కుషిత కళ్లపు గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న కుషిత కళ్లపు ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ బిజీగానే ఉంది. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు పెట్టి వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా 3 రోజెస్ లో కొత్త రోజ్ అంటూ ఆహా కుషిత కళ్లపు పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసింది.

Also Read : Rithu Chowdary : అతను ఉంటేనే జబర్దస్త్ చేస్తాను.. లేకపోతే చేయను.. జబర్దస్త్ పై రీతూ చౌదరి కామెంట్స్..

ఈ గ్లింప్స్ లో కుషిత బ్యాక్ లెస్ గా కనపడి షాక్ ఇచ్చింది. దీంతో ఈ సిరీస్ లో కుషిత బాగా బోల్డ్ గా నటించబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కుషిత కళ్లపు 3 రోజెస్ గ్లింప్స్ వైరల్ గా మారింది. ఈ గ్లింప్స్ తో సిరీస్ కోసం ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మీరు కూడా కుషిత కళ్లపు 3 రోజెస్ గ్లింప్స్ చూసేయండి..

Also Read : Tollywood Director : సైంటిస్ట్ అవ్వాల్సిన వాడు డైరెక్టర్ అయ్యాడు.. ఆ హీరోల ఫ్యాన్స్ కి లైఫ్ టైం గుర్తుండిపోయే సినిమా ఇచ్చి..