Tollywood Director : సైంటిస్ట్ అవ్వాల్సిన వాడు డైరెక్టర్ అయ్యాడు.. ఆ హీరోల ఫ్యాన్స్ కి లైఫ్ టైం గుర్తుండిపోయే సినిమా ఇచ్చి..
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా?

Do You Know about this Tollywood Director supposed to be a scientist became a director
Tollywood Director : సినిమాల్లోకి వచ్చేవాళ్ళు చాలా మంది వేరే ఫీల్డ్స్ నుంచి వచ్చినవాళ్లే ఉంటారు. వేరే ఫీల్డ్స్ లో సక్సెస్ అయినవాళ్లు కూడా సినిమాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. త్రివిక్రమ్, సుకుమార్, శైలేష్ కొలను.. ఇలా చాలా మంది డైరెక్టర్స్ వాళ్ళ ఫీల్డ్స్ లో సక్సెస్ అయి సినిమాల్లోకి వచ్చారు. అదే లిస్ట్ లో మరో డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఈ డైరెక్టర్ ఏకంగా సైంటిస్ట్ అవ్వాల్సిన వాడు సినిమాల్లోకి వచ్చాడు.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అనుకుంటున్నారా? మహేష్ బాబు, వెంకటేష్ అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు లైఫ్ టైం గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా మారిన శ్రీకాంత్ అడ్డాల ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇచ్చారు. ఇటీవల పెదకాపు అనే సినిమాతో వచ్చి నిరాశపరిచారు.
Also Read : Kishkindhapuri : ‘కిష్కింధపురి’ గ్లింప్స్ వచ్చేసింది.. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ హారర్ సినిమా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన స్టడీ గురించి, తాను ఏమవ్వాలనుకున్న దాని గురించి తెలిపాడు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. నేను ఢిల్లీ IIT లో PHD చేస్తున్నప్పుడు మధ్యలో వదిలేసి సినిమాల్లోకి వచ్చాను. అప్పట్లో జర్మనీ లేదా న్యూజిలాండ్ వెళ్లి సైంటిస్ట్ అవ్వాలని ఉండేది. అట్మాస్ఫియర్ ఫిజిక్స్ లో న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ మీద PHD చేసేవాడ్ని దాన్ని మధ్యలో వదిలేసి వచ్చేసాను. నా ఫ్రెండ్స్ చాలా మంది ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నారు అని తెలిపాడు.