Manchu Vishnu – Sree Vishnu : శ్రీవిష్ణుపై ఫిర్యాదు చేసే ఆలోచనలో మంచు విష్ణు..? టాలీవుడ్ లో చర్చగా మారిన ‘సింగిల్’ ట్రైలర్..
శ్రీవిష్ణు మే 9న సింగిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. నిన్నే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.

Manchu Vishnu wants to give Complaint on Hero Sree Vishnu and Single Movie Unit After Watching Single Trailer
Manchu Vishnu – Sree Vishnu : టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు సినిమాలు, ఆయన సినిమాల్లోని డైలాగ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొన్ని బూతు పదాలని కూడా కవర్ చేసి అక్కడ వేరే పదాలు వాడి అర్ధం అయి అవ్వనట్టు శ్రీవిష్ణు సినిమా డైలాగ్స్ యూత్ ని నవ్విస్తాయి. శ్రీవిష్ణు మే 9న సింగిల్ అనే సినిమాతో రాబోతున్నాడు. నిన్నే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు.
అయితే శ్రీవిష్ణు సింగిల్ సినిమా ట్రైలర్ లో శివయ్యా.. అనే ఓ డైలాగ్ ఉంది. అలాగే లాస్ట్ లో మంచు కురిసిపోవడం అనే ఓ డైలాగ్ ఉంది. ఈ రెండిటిపై మంచి విష్ణు హార్ట్ అయ్యాడట. ఈ విషయంలో శ్రీవిష్ణు పై మంచు విష్ణు పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.
Also Read : HIT 3 : నాని హిట్ 3 థియేటరికల్ బిజినెస్ ఎంతంటే..? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..?
మంచు విష్ణు కన్నప్ప సినిమా టీజర్ లో శివయ్యా.. అనే డైలాగ్ ఉండగా అది బాగా ట్రోల్ అయింది. ఆ ట్రోలింగ్ ని కామెడీగా తీసుకొని శ్రీవిష్ణు శివయ్యా డైలాగ్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అలాగే సింగిల్ ట్రైలర్ లో లాస్ట్ లో ఓ బూతు పదం ప్లేస్ లో మంచు కురిసిపోవడం అని వాడారు. తన ఇంటిపేరుని అలా వాడాడు అని కూడా విష్ణు హార్ట్ అయినట్టు సమాచారం.
దీంతో ఈ రెండు డైలాగుల విషయంలో మంచు విష్ణు హార్ట్ అయినట్టు, శ్రీవిష్ణు పై, మూవీ యూనిట్ పై ఫిర్యాదు చేయబోతున్నట్టు టాలీవుడ్ లో చర్చ జరుగుతుంది. సినిమాని సినిమాలాగా, కామెడీని కామెడీలాగా తీసుకోకుండా సాటి హీరోనే ఫిర్యాదు చేస్తే మంచు విష్ణు మరోసారి ట్రోలింగ్ అవ్వక తప్పదు అని అంటున్నారు. ఈ వివాదంతో సింగిల్ సినిమాకే మరింత పబ్లిసిటీ ఫ్రీగా వచ్చేలా అంది. మరి మంచు విష్ణు ఏం చేస్తాడో చూడాలి.
Also Read : Garuda 2.0 : ఐశ్వర్య రాజేష్ తమిళ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.. ఇప్పుడు డబ్బింగ్ తో తెలుగు ఓటీటీలో
శ్రీ విష్ణు సింగిల్ సినిమా ట్రైలర్ మీరు కూడా చూసేయండి..