HIT 3 : నాని హిట్ 3 థియేటరికల్ బిజినెస్ ఎంతంటే..? హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..?
హిట్ 3 సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి.

Nani Hit 3 Movie Theatrical Business Details
HIT 3 : శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న సినిమా హిట్ 3. నాని, శ్రీనిధి శెట్టి జంటగా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉంది, A సర్టిఫికెట్, పిల్లలు సినిమాకు రావొద్దు అని మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో చెప్పడం గమనార్హం. నాని ప్రస్తుతం హీరోగా, నిర్మాతగా ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
హిట్ 3 సినిమాపై అయితే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేయగా భారీ బుకింగ్స్ అవుతున్నాయి. నాని సినిమా అంటే ఇటీవల మినిమమ్ 100 కోట్ల కలెక్షన్స్ అని ఫిక్స్ అయిపోయారు. డిజిటల్ రైట్స్ కూడా అన్ని ముందే అమ్ముడుపోతున్నాయి. హిట్ 3 సినిమాకు నెట్ ఫ్లిక్స్ దాదాపు 40 కోట్ల వరకు ఇచ్చి కొనుక్కుందట. ఆడియో రైట్స్ ఆల్మోస్ట్ 6 కోట్లకు అమ్ముడుపోయాయట.
Also Read : Rithu Chowdary : బిగ్ బాస్ ఎంట్రీ పై రీతూ చౌదరి కామెంట్స్.. వెళ్తారా అని అడిగితే..
ఇక హిట్ 3 సినిమాకు థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. టాలీవుడ్ సమచారం ప్రకారం హిట్ 3 సినిమా థియేట్రికల్ రైట్స్ నైజాంలో 13 కోట్లు, సీడెడ్ లో 5.40 కోట్లు, ఆంద్రలో 15 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో 5.50 కోట్లు, ఓవర్సీస్ లో 10 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఆల్మోస్ట్ 48.90 కోట్లకు హిట్ 3 థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే కనీసం 50 కోట్లు షేర్ కలెక్ట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ గ్రాస్ 100 కోట్లు కలెక్ట్ చేయాలి. అయితే నానికి, ఈ సినిమా మీద ఉన్న హైప్ కి 100 కోట్లు ఈజీగా వీకెండ్ లోపే వచ్చేస్తాయని ఫ్యాన్స్ అంటున్నారు.
Also Read : Anil Ravipudi-Chiranjeevi : చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీలో విలన్ అతడేనా!