Seetha Payanam : కూతురు హీరోయిన్ గా.. తండ్రి దర్శకుడిగా.. సీతా పయనం నుంచి పెళ్లి సాంగ్ చూశారా..?
తాజాగా ఈ సినిమా నుంచి 'అస్సలు సినిమా ముందుంది..' అని సాగే పెళ్లి సాంగ్ ని రిలీజ్ చేశారు. (Seetha Payanam)
Seetha Payanam
Seetha Payanam : యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకుడిగా, నిర్మాతగా తన కూతురు ఐశ్వర్య అర్జున్ ని హీరోయిన్ గా పెట్టి తెరకెక్కిస్తున్న సినిమా ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా నిరంజన్, ఐశ్వర్య అర్జున్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్, అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా కామియో రోల్స్ లో కనిపించబోతున్నారు.(Seetha Payanam)
ఈ సినిమాను ఫిబ్రవరి 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ‘అస్సలు సినిమా ముందుంది..’ అని సాగే పెళ్లి సాంగ్ ని రిలీజ్ చేశారు.
Also Read : Akira Nandan : ఇద్దరు చెల్లెళ్ళతో పవన్ తనయుడు.. ఇది రియలా? AI ఫొటోనా?
చంద్రబోస్ లిరిక్స్ రాయగా అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వంలో శ్రీయ ఘోషల్ ఈ పాటను పాడారు. ఈ పాటలో ఐశ్వర్య అర్జున్ స్టెప్స్ హైలైట్. మీరు కూడా ఈ సాంగ్ చూసేయండి..
Also See : Sakshi Vaidya : ట్రెండీ లుక్స్ లో ఏజెంట్ భామ.. మళ్ళీ సంక్రాంతికి వస్తుందిగా..
