SDT18 : ఐశ్వర్య లక్ష్మితో సాయి దుర్గా తేజ్ రొమాన్స్..! పిక్ వైరల్..
సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నూతన దర్శకుడు రోహిత్ డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నాడు.
SDT18 Update : సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నూతన దర్శకుడు రోహిత్ డైరెక్షన్‌లో ఓ మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ సాయి దుర్గా తేజ్ కెరీర్‌లో 18వ సినిమాగా తెరకెక్కుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది.
తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాలీడ్ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర బృందం. ఈ మూవీలో సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్యలక్ష్మి నటిస్తున్నట్లు వెల్లడించింది. నేడు (సెప్టెంబర్ 6) ఐశ్వర్యలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీలో ఐశ్వర్య.. వసంత పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించింది.
Mokshagna : అక్క నిర్మాణంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..
ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
A Breeze in the barren lands 🍃
Unveiling #AishwaryaLekshmi
as VASANTHA from the Magnanimous World of #SDT18 on the occasion of her birthday 💥#HBDAishwaryaLekshmiMega Supreme Hero @IamSaiDharamTej @rohithkp_dir @Niran_Reddy @ChaitanyaNiran pic.twitter.com/Ghwznf4r2S
— Primeshow Entertainment (@Primeshowtweets) September 6, 2024