Mangalavaaram : శుక్రవారం రానున్న ‘మంగళవారం’.. RX 100 డైరెక్టర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

మంగళవారం మూవీ షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా. ఇటీవల రిలీజ్ చేసిన మగళవారం సినిమా టీజర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్.

Mangalavaaram : శుక్రవారం రానున్న ‘మంగళవారం’.. RX 100 డైరెక్టర్ నెక్స్ట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..

Ajay Bhupathi Payal Rajputh Mangalavaaram Movie releasing date announced

Updated On : September 26, 2023 / 11:19 AM IST

Mangalavaaram :  ‘ఆర్ఎక్స్ 100’(RX 100) సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి. కాని ఆ తర్వాత శర్వానంద్, సిద్దార్ద్ లతో మల్టీస్టారర్ మహాసముద్రం అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రయోగం చేసి పరాజయం పాలయ్యాడు. ఇప్పుడు ‘మంగళవారం’ అనే మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు.

ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, ఎం సురేష్ వర్మ, ‘A’ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అజయ్ భూపతి సంయుక్త నిర్మాణంలో అజయ్ భూపతి దర్శకత్వంలో RX 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతుంది మంగళవారం. ఈ సినిమాకు ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Image

Also Read : Mythri Movie Makers : బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న మైత్రి మూవీ మేకర్స్.. సల్మాన్ ఖాన్‌తో కలిసి..

ఇప్పటికే మంగళవారం మూవీ షూట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది ఈ సినిమా. ఇటీవల రిలీజ్ చేసిన మగళవారం సినిమా టీజర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్. మంగళవారం సినిమాని నవంబర్ 17న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు చిత్రయూనిట్. నవంబర్ 17 శుక్రవారం నాడు మంగళవారం సినిమా రానుంది. మరి ఈ సినిమాతో అజయ్ భూపతి మెప్పిస్తాడా లేదా చూడాలి.