Ajay Devagan : శబరిమలలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్నారు. తాజాగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అజయ్ దేవగణ్ శబరిమల వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం......

Ajay Devagan : శబరిమలలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్

Ajay Devagan

Updated On : January 17, 2022 / 6:52 AM IST

Ajay Devagan :  నవంబర్ నుంచి జనవరి వరకు శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు అయ్యప్ప మాల వేసుకొని దేశం నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. చాలా మంది సెలబ్రిటీలు కూడా అయ్యప్ప మాల వేసుకుని శబరిమల వచ్చి దర్శనం చేసుకుంటారు. తెలుగు, తమిళ్, మలయాళం, బాలీవుడ్ స్టార్లు చాలా మంది అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటారు. చిరంజీవి, రామ్ చరణ్, శర్వానంద్, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, ధనుష్, శింబు, వివేక్ ఒబెరాయ్…. ఇలా చాలా మంది ప్రముఖులు ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తారు. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా ఈ జాబితాలో చేరారు.

Kalyan Krishna : ‘బంగార్రాజు’ డైరెక్టర్‌కి తమిళ్ నుంచి భారీ ఆఫర్

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్నారు. తాజాగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నారు. అజయ్ దేవగణ్ శబరిమల వెళ్లిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అజయ్ దేవగణ్ తో పాటు తన రిలేటివ్స్ విక్రాంత్, ధర్మేంద్ర కూడా శబరిమల వెళ్లారు. అందరిలాగే ఇరుముడితో వచ్చి 18 మెట్లు ఎక్కి స్వామి వారి దర్శనం చేసుకొని మొక్కులు అప్పచెప్పారు అజయ్ దేవగణ్.