Ajay Devgn : భోళా ట్రైలర్ రిలీజ్.. పఠాన్ లాగే కోట్లు వసూలు చేస్తుంది.. అజయ్ దేవగణ్ వ్యాఖ్యలు..

తాజాగా భోళా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటేనే చాలా మార్పులు చేసినట్టు తెలిసిపోతుంది. అయితే ఈ ట్రైలర్ పై బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసినా సౌత్ ప్రేక్షకులు మాత్రం సినిమా కథ అంతా మార్చేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక భోళా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అజయ్ దేవగణ్ మాట్లాడుతూ...............

Ajay Devgn : భోళా ట్రైలర్ రిలీజ్.. పఠాన్ లాగే కోట్లు వసూలు చేస్తుంది.. అజయ్ దేవగణ్ వ్యాఖ్యలు..

Ajay Devgn Bholaa trailer released ajay devgn comments on bholaa movie result

Updated On : March 7, 2023 / 11:56 AM IST

Ajay Devgn :  గత కొన్ని రోజులుగా మన సౌత్ లో హిట్ అయిన సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ బాలీవుడ్ వాళ్ళు చాలా మార్పులు చేసి తీయడంతో చాలా వరకు రీమేక్ సినిమాలు అక్కడ ఫ్లాప్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవగణ్ కూడా చాలానే సౌత్ సినిమాలను రీమేక్ చేస్తున్నాడు. ఇటీవల దృశ్యం 2 సినిమాని రీమేక్ చేసి మంచి విజయం సాధించాడు. ఇప్పుడు ఖైదీ రీమేక్ ని తీశాడు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా భారీ విజయం సాధించింది. ఒక్క రాత్రిలో జరిగిన కథతో దీన్ని తెరకెక్కించి క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాని అజయ్ దేవగణ్ బాలీవుడ్ లో భోళా అనే పేరుతో తెరకెక్కిస్తున్నారు. కథలో చాలా మార్పులు చేసి హీరోయిన్ ని పెట్టి, హీరోకి ఫ్లాష్ బ్యాక్ పెట్టి, లేడీ పోలీసాఫీసర్ ని పెట్టి.. ఇలా అనేక మార్పులు చేసి అజయ్ దేవగణ్ సొంతంగా దర్శకత్వం కూడా వహించాడు ఈ సినిమాకి.

Ranbir Kapoor : కూతురు కోసం ఆరు నెలలు సినిమాలకి హాలిడేస్ ఇస్తున్న రణబీర్ కపూర్..

తాజాగా భోళా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటేనే చాలా మార్పులు చేసినట్టు తెలిసిపోతుంది. అయితే ఈ ట్రైలర్ పై బాలీవుడ్ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేసినా సౌత్ ప్రేక్షకులు మాత్రం సినిమా కథ అంతా మార్చేశారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక భోళా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అజయ్ దేవగణ్ మాట్లాడుతూ.. ఇటీవల పఠాన్ సినిమా రిలీజయి భారీ హిట్ కొట్టి కోట్లు కలెక్ట్ చేసింది. దాని దారిలోనే ఇప్పుడు భోళా సినిమా కూడా రిలీజయి కోట్లు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అని అన్నారు. ఇటీవల పఠాన్ తర్వాత రిలీజయిన సినిమాలు కూడా మళ్ళీ ఫ్లాప్స్ అయ్యాయి. దీంతో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.