Ajay Devgn : తారక్ తండ్రిగా..

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో అజయ్ దేవ్‌గణ్.. తారక్ తండ్రిగా నటిస్తున్నారని తెలుస్తోంది..

Ajay Devgn : తారక్ తండ్రిగా..

Ajay Devgn

Updated On : June 29, 2021 / 4:08 PM IST

Ajay Devgn: అజయ్ దేవ్‌గణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సోలో హీరోగా నటిస్తూనే క్యారెక్టర్ నచ్చితే ఇతర హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హీరోగా ‘మైదాన్’, ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’, ‘థ్యాంక్ గాడ్’, ‘మేడే’ సినిమాలు చేస్తున్న అజయ్.. ‘సూర్యవన్షీ’ లో డీసీపీ బాజీరావ్ సింగం.. ‘గంగుబాయ్ కతియావాడి’ లో కరీమ్ లాలా క్యారెక్టర్లు చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ట్రిపుల్ ఆర్ లో అజయ్ కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు సినిమాలో అజయ్ క్యారెక్టర్ ఏంటి అనే హైప్ క్రియేట్ అయింది.

RRR : రామ్ – భీమ్.. పోస్టర్ అదిరిందిగా..!

‘ఆర్ఆర్ఆర్’ లో భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటీష్ వాళ్లతో పోరాడి ప్రాణ త్యాగం చేసే ధీరుడి పాత్రలో అజయ్ దేవ్‌గణ్ కనిపించనున్నారు. అయితే ఆయన ఈ సినిమాలో తారక్ తండ్రిగా నటిస్తున్నారని తెలుస్తోంది. కొమరం భీమ్ గురించి అందరికీ తెలుసు కానీ అతడు గోండు బెబ్బులిగా మారడం వెనుక తండ్రి ప్రోద్బలం, భీమ్‌కి తండ్రి స్ఫూర్తిగా నిలిచి, అతగాణ్ణి తిరుగులేని యోధుడిగా ఎలా తయారుచేశారు అనే అంశాల ఆధారంగా జక్కన్న తారక్ తండ్రిగా అజయ్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశారని, నిడివి తక్కువ అయినా ‘ఆర్ఆర్ఆర్’ లో అజయ్ క్యారెక్టర్ హైలెట్‌గా ఉంటుందని ఫిలింనగర్ టాక్..

Komaram Bheem NTR : గోండు బెబ్బులి గాండ్రింపు.. ‘ఆర్ఆర్ఆర్’ నుండి యంగ్ టైగర్ న్యూ పోస్టర్..