Kajol : “లైఫ్‌లో కఠిన పరిస్థితులు ఎదుర్కుంటున్నా”.. కాజోల్ పోస్ట్ వైరల్.. అసలు ఏమైంది..?
బాలీవుడ్ హీరోయిన్ మరియు అజయ్ దేవగన్ భార్య కాజోల్ సోషల్ మీడియాలో వైరల్ పోస్ట్ చేసింది. లైఫ్‌లో కఠిన పరిస్థితులు ఎదురుకుంటున్నా అంటూ..

Ajay Devgn wife Kajol viral post on social media The Good Wife
Kajol : బాలీవుడ్ హీరోయిన్ మరియు అజయ్ దేవగన్ (Ajay Devgn) భార్య కాజోల్ తాజాగా వైరల్ పోస్ట్ చేసింది. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, ఫనా వంటి సూపర్ హిట్ లవ్ సినిమాల్లో నటించి అప్పిటిలో కురాళ్ళకి డ్రీం గర్ల్ అయ్యిపోయిన కాజోల్.. ప్రస్తుతం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, పలు వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ లో నటిస్తూ వస్తుంది. కాగా కాజోల్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది. తన కూతురు నైసా దేవగన్ (Nysa Devgan) తో కలిసి హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో సందడి చేస్తుంటుంది. అయితే ఆ ఫోటోలు చూసిన కొందరు నెటిజెన్స్ మాత్రం కాజోల్ ని ట్రోల్ చేస్తూ వచ్చేవారు.
Anantha Movie Review : ‘అనంత’ సినిమా రివ్యూ.. 15 వేల ఏళ్ళ నుంచి బతికున్న మనిషి కథతో..
తాజాగా కాజోల్ తన ఇన్‌స్టాలో ఉన్న పోస్ట్ లు అన్ని డిలీట్ చేసేసింది. ఆ తరువాత ఒక కొత్త పోస్ట్ షేర్ చేసింది. “లైఫ్‌లో కఠిన పరిస్థితులు ఎదురుకుంటున్నా” అనే క్యాప్షన్ ఉన్న ఫోటోని షేర్ చేసిన కాజోల్ ఆ ఫోటో కింద.. సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోతున్నట్లు కామెంట్ రాసుకొచ్చింది. ఇక కాజోల్ సడన్ డెసిషన్ కి కారణం ట్రోల్స్ కారణమా? అని కొందరు ఆలోచిస్తుంటే, మరి కొంతమంది మాత్రం ప్రమోషన్స్ లో భాగం అని అంటున్నారు. కాజోల్ ప్రస్తుతం ‘ది గుడ్ వైఫ్’ (The Good Wife) అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.
NTR – Ram Charan : ఎన్టీఆర్ అండ్ చరణ్ తో కలిసి నటించడం అదృష్టం అంటున్న థోర్..
అమెరికన్ టీవీ సిరీస్ కి ఇది అడాప్షన్ గా తెరకెక్కుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే కాజోల్ అలా చేసి ఉండవచ్చని అంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar) లో ఈ సిరీస్ ప్రసారం కానుంది. గత ఏడాది సెప్టెంబర్ ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసిన మేకర్స్.. మళ్ళీ ఇప్పటి వరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఇక దీనితో పాటు లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) చిత్రంలో కూడా నటిస్తుంది. ఇటీవలే ఆ టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అది జూన్ 29న నెట్ ఫ్లిక్స్ (Netflix) లో రిలీజ్ కాబోతుంది.
View this post on Instagram