షూటింగులో గాయపడ్డ అజిత్..

కోలీవుడ్ - ప్రముఖ నటుడు ‘తల’ అజిత్ కుమార్ ‘వలిమై’ షూటింగులో గాయపడ్డారు..

  • Published By: sekhar ,Published On : February 19, 2020 / 06:55 AM IST
షూటింగులో గాయపడ్డ అజిత్..

Updated On : February 19, 2020 / 6:55 AM IST

కోలీవుడ్ – ప్రముఖ నటుడు ‘తల’ అజిత్ కుమార్ ‘వలిమై’ షూటింగులో గాయపడ్డారు..

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు తల అజిత్‌కు షూటింగ్‌లో గాయాల‌య్యాయి. వివ‌రాల్లోకి వెళ్తే..  ‘ఖాకి’ ద‌ర్శ‌కుడు హెచ్‌.వినోద్ ద‌ర్శ‌క‌త్వంలో ‘వ‌లిమై’  అనే సినిమాలో అజిత్ హీరోగా న‌టిస్తున్నాడు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘నెర్కొండ పార్వై’ (పింక్ రీమేక్) తర్వాత అజిత్, వినోద్, బోనీ కపూర్ కలయికలో రూపొందుతున్న సినిమా ఇది. సోమ‌వారం నాడు బైక్ ఛేజింగ్ సీన్‌ షూట్ చేస్తున్నప్పుడు బైక్ స్కిడ్ అవడంతో.. అజిత్‌కు చిన్న‌పాటి దెబ్బ‌లు త‌గిలాయి. ఇర‌వై నిమిషాల పాటు రెస్ట్ తీసుకుని ఆ సీన్‌ను కంప్లీట్ చేసి, ఆ తర్వాత అజిత్ హాస్పిట‌ల్‌కు వెళ్లాడ‌ట‌.

డాక్ట‌ర్స్ కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించార‌ు. అజిత్ కోలుకోవాలని అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. అజి‌త్‌కు గాయాలయ్యాయనే వార్త #GetWellSoonTHALA హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా తర్వాతి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది. 2020 నవంబర్ 12న ‘వలిమై’ విడుదల కానుంది.