Ajith – Aamir : చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమీర్‌ని పరామర్శించిన అజిత్..

చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమీర్ అండ్ విష్ణు విశాల్ పరిస్థితి తెలుసుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్.. వారిద్దర్నీ కలిసి పరామర్శించారు.

Ajith Kumar visited Aamir Khan who was caught in Chennai floods

Ajith Kumar – Aamir Khan : మిగ్‌జామ్ తుపానుతో చెన్నై నగరం అతలాకుతలం అయ్యిపోతుంది. వరదనీరు రోడ్డులు, ఇళ్లలోకి చొచ్చుకొచ్చి జన జీవనాన్ని స్తంభించేస్తుంది. ఈ వరదలు వల్ల కరెంటు పోవడం, కమ్యూనికేషన్ కట్ అవ్వడం, ఇళ్లలోకి వరద నీరు కొట్టుకురావడంతో ఆహారం కూడా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వరద బీభత్సంతో సాధారణ ప్రజలు మాత్రమే కాదు కోలీవుడ్ సినీ సెలబ్రిటీస్ సైతం కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ వరదల్లో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా చిక్కుకున్నారు.

ఆమీర్ తో పాటు వరదల్లో చిక్కుకున్న తమిళ్ హీరో విష్ణు విశాల్ ని రక్షక సిబ్బంది రక్షించి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు. అందుకు సంబంధించిన ఫోటోలను విష్ణు విశాల్ షేర్ చేస్తూ రక్షక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఆమీర్ అండ్ విష్ణు విశాల్ పరిస్థితి తెలుసుకున్న కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్.. వారిద్దర్నీ కలిసి పరామర్శించారు. వారిద్దరి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అలాగే విష్ణు విశాల్, ఆమీర్ తో పాటు చిక్కుకుపోయిన వారికీ సహాయం అందేలా అజిత్ చర్యలు చేపట్టారని విష్ణు విశాల్ తెలియజేశారు.

Also read : Bigg Boss 7 Day 93 : ఫైనల్స్ కోసం సీరియల్ బ్యాచ్ గేమ్ మొదలుపెట్టారా..?

ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ విష్ణు విశాల్ ఒక ఫోటో షేర్ చేశారు. ఆ ఫొటోలో అజిత్, ఆమీర్, విశాల్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఆమీర్ ఖాన్ గత కొన్ని రోజుల నుంచి చెన్నైలోనే ఉంటున్నారట. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో పాల్గొన్న ఆమీర్.. అప్పటి నుంచి చెన్నైలో ఉంటున్నారని చెబుతున్నారు. ఇక వచ్చే నెల 2024 జనవరి 3న ఆమీర్ కూతురు ఐరా ఖాన్ పెళ్లి జరగనుంది. ఐరా ప్రేమించిన నుపుర్ శిఖరేతోనే కూతురు పెళ్లి చేస్తున్నారు ఆమీర్ ఖాన్.