Bigg Boss 7 Day 93 : ఫైనల్స్ కోసం సీరియల్ బ్యాచ్ గేమ్ మొదలుపెట్టారా..?
మంగళవారం ఎపిసోడ్ లో 'చిల్ పార్టీ' అంటూ కొన్ని గేమ్స్ పెట్టారు. ఇక ఈ ఎపిసోడ్ లో సీరియల్ బ్యాచ్ ఆట తీరు చూస్తే.. వీరు ఫైనల్స్ కోసం కొత్త గేమ్ షురూ చేశారా అనిపిస్తుంది.

Telugu Bigg Boss 7 Day 93 Highlights Vote for me tasks
Bigg Boss 7 Day 93 : బిగ్‌బాస్ 14వ వారం మొదలయింది. కంటెస్టెంట్స్ లో టైటిల్ గెలిచే స్పిరిట్ మరింత పెరిగింది. దీంతో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేందుకు ఎవరికి వారు కొత్త స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. అమర్, ప్రశాంత్, యావర్, శోభాశెట్టి, ప్రియాంక, శివాజీ, అర్జున్ ఉన్నారు. వీరిలో అర్జున్ మొదటి ఫైనలిస్ట్ గా ఫినాలేకి ఎంట్రీ ఇచ్చేశారు. ఇక ఈ వీక్ సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో ముగిసింది. మంగళవారం ఎపిసోడ్ లో ‘చిల్ పార్టీ’ అంటూ కొన్ని గేమ్స్ పెట్టారు.
ఈ గేమ్స్ లో గెలిచిన వారికి ఓటు అడిగే ఛాన్స్ వస్తుందని బిగ్ బాస్ తెలియజేసాడు. ఈక్రమంలోనే రెండు గేమ్స్ పెట్టగా.. ఒకదానిలో యావర్, మరోదానిలో శోభా విజేతలుగా నిలిచారు. అయితే బిగ్ బాస్ ఇక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టాడు. గెలిచిన ఇద్దరు కాకుండా ఒక్కరు మాత్రమే ‘ఓటు ఫర్ అపిల్’ ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ఇద్దరిలో ఒకర్ని ఎన్నుకోవాలని హౌస్ లోని మిగిలిన కంటెస్టెంట్స్ కి తెలియజేశాడు. ఇక హౌస్‌మేట్స్ ఓటింగ్ తో శోభా విజేతగా నిలిచి అపిల్ చేసుకునే అవకాశం అందుకుంది.
Also read : Abhiram Daggubati : లంకలో అభిరాముడి కళ్యాణం.. బయలుదేరిన దగ్గుబాటి కుటుంబం..
ఆడియన్స్ కి శోభా ఓటు అపిల్.. “ఇన్నాళ్లు కార్తీకదీపం మోనితగా గుర్తుకు ఉన్న నేను. ఇప్పటి నుంచి బిగ్‌బాస్ శోభాశెట్టిగా గుర్తుకు ఉండబోతున్నాను. బిగ్‌బాస్ 6 సీజన్స్ లో అబ్బాయిలే టైటిల్స్ గెలిచారు. ఈ సీజన్ అయినా ఒక అమ్మాయి గెలవాలి అనుకుంటున్నాను. అది నేను అవ్వాలని అనుకుంటున్నాను. అలాగే టైటిల్ గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ నాకు చాలా ఇంపార్టెంట్. అందుకు మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్” అంటూ రిక్వెస్ట్ చేసింది.
ఇది ఇలా ఉంటే, మంగళవారం ఎపిసోడ్ లో సీరియల్ బ్యాచ్ అమర్, శోభాశెట్టి, ప్రియాంక ఆట చూస్తే.. వీరు ఫైనల్స్ కోసం కొత్త గేమ్ షురూ చేశారా అనిపిస్తుంది. పెద్ద విషయం లేకుండా ఊరుకునే గొడవపడటం, మళ్ళీ వెంటనే కలిసి మాట్లాడుకోవడం విచిత్రంగా అనిపించింది. అర్జున్ కూడా ఒక సందర్భంలో.. మీ ముగ్గురికి ఏం తోచడం లేదు అనుకుంటా అని నవ్వడం, సీరియల్ బ్యాచ్ కూడా నవ్వడం చూస్తే ఒకటి అనిపిస్తుంది. ఫైనల్స్ కి చేరుకున్నారు కాబట్టి ఆడియన్స్ దృష్టి తమ పై ఉండేలా సీరియల్ బ్యాచ్ ఇలా చేస్తుందని అనుమానం కలుగుతుంది.