తెలుగులో విశ్వాసం : మార్చి 1 విడుదల
మార్చి 1న విశ్వాసం తెలుగులో గ్రాండ్‌గా రిలీజవనుంది.

మార్చి 1న విశ్వాసం తెలుగులో గ్రాండ్‌గా రిలీజవనుంది.
తళ అజిత్, నయనతార జంటగా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మాణంలో రూపొందిన విశ్వాసం.. తమిళనాట సంక్రాంతి కానుకగా విడుదలై, ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. వీరం, వేదాళం, వివేకం తర్వాత, అజిత్, దర్శకుడు శివల కాంబినేషన్‌లో వచ్చిన నాలుగవ సినిమా ఇది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే విశ్వాసంకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి, అజిత్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన విశ్వాసం, ఇప్పుడు తెలుగులో రిలీజవబోతుంది. ఆర్.నాగేశ్వర రావు తమిళ్ విశ్వాసంని.. అదే పేరుతో తెలుగులో రిలీజ్ చెయ్యనున్నాడు.
ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన విశ్వాసంలో అజిత్ డ్యుయెల్ రోల్ చేసాడు. జగపతి బాబు స్టైలిష్ విలన్‌గా కనిపించాడు. డి.ఇమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. మార్చి 1న విశ్వాసం తెలుగులో గ్రాండ్‌గా రిలీజవనుంది. ఈ సినిమాకి కెమెరా : వెట్రి, ఎడిటింగ్ : రూబెన్.
వాచ్ విశ్వాసం తమిళ ట్రైలర్…