ఆకాష్ పూరీ – రొమాంటిక్ మూవీ ప్రారంభం

ఆకాష్ హీరోగా నటించబోయే మూడవ సినిమా ప్రారంభమైంది.

  • Published By: sekhar ,Published On : February 11, 2019 / 07:56 AM IST
ఆకాష్ పూరీ – రొమాంటిక్ మూవీ ప్రారంభం

ఆకాష్ హీరోగా నటించబోయే మూడవ సినిమా ప్రారంభమైంది.

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరీ, తండ్రి డైరెక్ట్ చేసిన చిరుత, బుజ్జిగాడు లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు.. ఆంధ్రాపోరీ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆకాష్ హీరోగా పూరీ డైరెక్ట్ చేసిన రెండవ సినిమా.. మొహబూబా కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పుడు ఆకాష్ హీరోగా నటించబోయే మూడవ సినిమా ప్రారంభమైంది. అనిల్ పాదూరి డైరెక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. పూరీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఈ మూవీకి ‘రొమాంటిక్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యానర్స్‌పై, పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

ఈ సినిమా కోసం ఆకాష్ చాలా బాగా మేకోవర్ అయ్యాడు. అఫీషియల్‌గా రిలీజ్ చేసిన అతని పిక్స్ సూపర్బ్‌గా ఉన్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్, రమాప్రభ ముఖ్య అతిథులుగా ‘రొమాంటిక్’ మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈ వివరాలతో చార్మీ వీడియో పోస్ట్ చేసింది.  బ్యూటీఫుల్ లవ్ స్టోరీగా రూపొందనున్న ‘రొమాంటిక్’ సినిమా హీరోయిన్, ఇతర టెక్నీషియన్స్ సెలక్షన్ జరుగుతుంది. పూరీ ప్రస్తుతం, ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీ చేస్తున్నాడు. నిధి అగర్వాల్, నభా నటేశ్ హీరోయిన్స్‌కాగా, మణిశర్మ సంగీతమందిస్తున్నాడు.  

వాచ్ వీడియో…