Akhil Akkineni: ఆయనతో పనిచేయడం నిజంగా అదృష్టం – అఖిల్
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అఖిల్ తెలిపాడు.

Akhil Akkineni About Working With Mammotty
Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీలోకి మారిపోయాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వదద్ సెన్సేషనల్ హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో. కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి.
Akhil Akkineni : నాన్న పై ఆధారపడడం ఇష్టం లేదు.. అన్నయ్య, నేను మాట్లాడుకుంటాం!
కాగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిన్న(ఏప్రిల్ 23న) గ్రాండ్‌గా నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కు కింగ్ నాగార్జున గెస్టుగా వచ్చారు. అయితే, ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో నటించడం తనకు సంతోషాన్ని కలిగించిందని.. ఇలాంటి కథ తనకు దక్కడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ కథను చాలా పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడని.. ఇది అందరికీ నచ్చుతుందని.. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ మమ్ముట్టితో కలిసి నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు అఖిల్ తెలిపాడు.
Akhil Akkineni : సింపుల్ లుక్‌లో ఏమున్నాడురా బాబు అఖిల్..
ఈ సినిమాలో అందాల భామ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ చిత్రానికి హిప్‌హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.