Akhil Akkineni: ఏజెంట్ సరికొత్త రిలీజ్ డేట్ అదేనా.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఒక్కటే మిగిలిందా..?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ‘ఏజెంట్’ రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.

Akhil Akkineni Agent Movie To Get Release On This Date
Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ కోసం అభిమానులు ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండగా, పూర్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ‘ఏజెంట్’ రానుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
Akhil Akkineni: శివరాత్రి వరకు జాగారం చేయనున్న ఏజెంట్..?
అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనే విషయంపై మాత్రం అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా రోజులే అవుతున్నా.. ఇంకా రిలీజ్ మాత్రం కావడం లేదు. అయితే దీనికి కొన్ని బలమైన కారణాలు ఉన్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా ఎలాంటి విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా చిత్ర యూనిట్ చూస్తుందని తెలిపారు. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోనూ ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేలా చిత్ర యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాను ఏప్రిల్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
Akhil Akkineni: అఖిల్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న కరణ్ జోహర్..?
ఏప్రిల్ 14న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ కూడా అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తోంది. హిప్‌హాప్ తమిళ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఏకె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ప్రొడ్యూస్ చేస్తున్నారు.