Akhil Akkineni : ‘తారక సింహా రెడ్డి’గా అయ్యగారు.. సైలెంట్ గా షూట్ చేసేస్తున్నారా?

అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Akhil Akkineni : ‘తారక సింహా రెడ్డి’గా అయ్యగారు.. సైలెంట్ గా షూట్ చేసేస్తున్నారా?

Akhil Akkineni as Taraka Simha Reddy in his next Movie Rumours goes Viral

Updated On : February 23, 2024 / 8:00 PM IST

Akhil Akkineni : అక్కినేని అఖిల్ కి ఇప్పటిదాకా భారీ హిట్ పడలేదు. మొదటి సినిమా నుంచి కష్టపడుతున్నా సరైన విజయం మాత్రం రావట్లేదు. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ అయితే ఫ్లాప్ లేదా యావరేజ్ గానే ఉన్నాయి. గత సంవత్సరం భారీ బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఏజెంట్ సినిమా వచ్చి దాదాపు సంవత్సరం కావొస్తున్నా అధికారికంగా నెక్స్ట్ సినిమా ప్రకటించలేదు.

అయితే అఖిల్ నెక్స్ట్ సినిమా అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పీరియాడిక్ సబ్జెక్టుతో రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల కొన్ని రాజుల క్రితమే దర్శకుడు అనిల్ అఖిల్ తో ఓ ఫోటోని కూడా షేర్ చేసాడు. అనిల్ గతంలో సాహో సినిమాకి, యూవీ క్రియేషన్స్ సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. వీళ్ళ కాంబోలో రాబోతున్న అఖిల్ సినిమాకి ‘ధీర’ అనే టైటిల్ పెట్టినట్టు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా మరో వార్త వైరల్ అవుతుంది.

Also Read : Tillu Square : డీజే టిల్లు సీక్వెల్ రన్ టైం జస్ట్ అంతేనా? సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు ఎందుకు అలా?

అఖిల్ నెక్స్ట్ సినిమా మహారాష్ట్రలోని ఓ ఫారెస్ట్ లో షూటింగ్ జరుగుతుందని, సినిమా పేరు ధీర అని, ఈ సినిమాలో అఖిల్ క్యారెక్టర్ పేరు తారక సింహా రెడ్డి అని టాలీవుడ్ సమాచారం. ఓ పవర్ ఫుల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో అయ్యగారి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారైనా అఖిల్ పెద్ద హిట్ కొట్టాలని అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఎదురుచూస్తుంది. మరి అఖిల్ తారక సింహా రెడ్డి పాత్ర నిజమేనా కాదా అంటే ఇంకొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.