Akhil Akkineni : నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్.. పెళ్లికూతురు ఎవరో తెలుసా..?

తాజాగా అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగింది.

Akhil Akkineni Engaged with Zainab Ravdjee Photos goes Viral

Akhil Akkineni : అక్కినేని కుటుంబంలో మరో శుభకార్యం జరిగింది. త్వరలో నాగచైతన్య – శోభిత పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జరిగింది. నేడు నాగార్జున అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించి ఫోటోలు షేర్ చేసాడు.

Also Read : Robinhood Song : ‘రాబిన్ హుడ్‌’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. నితిన్, శ్రీలీల స్టైలిష్ గా అదరగొట్టారుగా..

నాగార్జున తన ట్వీట్ లో.. మా తనయుడు అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగింది. జైనబ్ మా ఫ్యామిలీలోకి రావడం సంతోషంగా ఉంది. ఈ యంగ్ కపుల్ కి మీ ఆశీర్వాదాలు అందించండి అని పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారగా అఖిల్ సడెన్ గా అనిశ్చితార్థం చేసుకున్నాడు అని చెప్పడంతో అంతా షాక్ అవుతున్నారు.

 

అయితే జైనబ్ రవ్జీ వ్యాపారవేత్త అని తెలుస్తుంది. బ్యూటీ కేర్ రంగంలో ఆమెకు బిజినెస్ ఉందని సమాచారం. అలాగే రానా భార్య మిహీకకు జైనబ్ రవ్జీ స్నేహితురాలు అని, వారి పెళ్ళితోనే అఖిల్ కి పరిచయం ఏర్పడి ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఈమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కూతురు.