Robinhood Song : ‘రాబిన్ హుడ్’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది.. నితిన్, శ్రీలీల స్టైలిష్ గా అదరగొట్టారుగా..
తాజాగా రాబిన్ హుడ్ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసారు.

Nithiin Sreeleela Robinhood Movie First Song Released
Robinhood Song : నితిన్, శ్రీలీల జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘రాబిన్ హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మాణంలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రాబిన్ హుడ్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read : Divi – Pushpa 2 : పుష్ప 2 డబ్బింగ్ పూర్తిచేసిన ఆ భామ.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు..
తాజాగా రాబిన్ హుడ్ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేసారు. ‘లుక్కిస్తే చాలు లక్కీగా ఫీల్ అవుతాను.. వన్ మోర్ టైం..’ అంటూ స్టైలిష్ గా సాగింది ఈ పాట. ఈ పాటను కృష్ణకాంత్ రాయగా GV ప్రకాష్ సంగీత దర్శకత్వంలో GV ప్రకాష్, విద్య వోక్స్ కలిసి పాడారు. పాట చూడటానికి కూడా కలర్ ఫుల్ గా ఉంది. మీరు కూడా ఈ వన్ మోర్ టైం సాంగ్ వినేయండి..