Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఉత్తర్వులు జారీ
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల..

Telangana Govt
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల ఆరోగ్యానికి, పౌషకాహార లోపాన్ని నివారించడానికి చర్యలు చేపట్టింది. దీంతో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి పదో తరగతి విద్యార్థులకు రాగిజావ అందించనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read : Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
రాష్ట్ర వ్యాప్తంగా 25వేల బడుల్లో పీఎం పోషణ్ కింద సుమారు 18లక్షల మందికి మిడ్ డే మీల్స్ అందిస్తున్నారు. అయితే, పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు రెండేళ్లుగా రాగిజావ అందిస్తున్నారు. వారంలో మూడు రోజులు కోడిగుడ్డు, మరో మూడు రోజులు రాగిజావ ఇస్తున్నారు. అయితే, వరుసగా మూడో ఏడాది కూడా అందించేందుకు స్కూల్ ఎడ్యకేషన్ అధికారులు.. విద్యాశాఖ, ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులకు ప్రపోజల్స్ పెట్టారు.
ఇందుకోసం ప్రతీయేటా సుమారు రూ.35కోట్ల వరకూ నిధులు అవసరం కాగా.. వీటిలో ఏడాది 60శాతం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు వాళ్లే పెట్టుకోనుండగా.. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం అందించనుంది.
గత రెండేళ్లుగా ఈ రాగి జావ పంపిణీ కార్యక్రమం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో కొనసాగుతోంది. అయితే, ఈ కార్యక్రమానికి అయ్యే వ్యయంలో 40శాతం భరించాలని ట్రస్ట్ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై విద్యాశాఖ రెండు నెలలుగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యార్థులకు రాగి జావ అందించేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ విద్యా సంవత్సరంకూడా శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు సహకారంతో ఈ స్కీం అమలు చేస్తున్నామని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ట్రస్టు రాగి పౌడర్, బెల్లం పౌడర్ ను స్కూళ్లకు సరఫరా చేస్తుంది. అయితే, విద్యార్థులకు రాగిజావను తయారు చేసి అందించినందుకు ప్రతి గ్లాసుకు రోజుకు 25పైసల చొప్పున చార్జీలను సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు చెల్లించనున్నారు.