Akira Nandan : ఫస్ట్ టైం ఆ పని చేసిన అకిరా.. అభినందిస్తున్న పవన్ ఫ్యాన్స్..

అకిరా కూడా బాక్సింగ్, కరాటే.. లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అకిరా సినిమాల్లోకి వస్తాడో రాడో తెలీదు కానీ అన్ని రకాల విద్యలు నేర్చుకుంటున్నాడు. తాజాగా అకిరా మొదటి సారి............

Akira Nandan : ఫస్ట్ టైం ఆ పని చేసిన అకిరా.. అభినందిస్తున్న పవన్ ఫ్యాన్స్..

Akira

Updated On : April 22, 2022 / 7:49 PM IST

 

Akira Nandan :  పవన్ తనయుడు అకిరా నందన్, కూతురు ఆద్య ఏం చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వాళ్ళు పవన్ దగ్గర ఉండకపోయినా పవన్ అభిమానుల కళ్ళు వారిమీద ఎప్పుడూ ఉంటాయి. తమ తల్లి రేణు దేశాయ్ దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు పవన్ ని కలుస్తూ ఉంటారు ఇద్దరూ. ఇక వీరిద్దరూ స్పెషల్ గా ఏం చేసినా రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఇటీవలే అకిరా నందన్ 18 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు.

Krithi Shetty : బుల్లెట్ బండిపై డ్యూయెట్.. శింబు పాటకి అదిరిపోయే స్టెప్స్‌తో రామ్, కృతి

ఇక అకిరా కూడా బాక్సింగ్, కరాటే.. లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అకిరా సినిమాల్లోకి వస్తాడో రాడో తెలీదు కానీ అన్ని రకాల విద్యలు నేర్చుకుంటున్నాడు. తాజాగా అకిరా మొదటి సారి రక్తదానం చేశాడు. అకిరా రక్తదానం చేస్తున్న ఓ ఫోటోని రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. ”18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం. అవసరంలో ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైన వస్తువు మన రక్తం. దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత మీకు వీలైనంత వరకు రక్తదానం చేయండి. దాని ద్వారా మీరు ఎవరో ఒకరి ప్రాణాలని రక్షించినవారవుతారు” అంటూ పోస్ట్ చేసింది. ఇక అకిరా చేసిన ఈ పనికి పవన్ అభిమానులు అభినందిస్తున్నారు.

View this post on Instagram

A post shared by renu (@renuudesai)