Akira Nandan Pawan Video : నాన్నకు ప్రేమతో.. పవన్ మూవీ జర్నీపై అకిరా స్పెషల్ వీడియో.. రేణు దేశాయ్ పోస్టు వైరల్!

Akira Nandan Pawan Video : నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనమని ఆమె క్యాప్షన్ కూడా పెట్టారు.

Akira Nandan Pawan Video : నాన్నకు ప్రేమతో.. పవన్ మూవీ జర్నీపై అకిరా స్పెషల్ వీడియో.. రేణు దేశాయ్ పోస్టు వైరల్!

Akira Nandan Edits Video On Pawan Movie ( Image Credit : Instagram )

Updated On : June 5, 2024 / 11:46 PM IST

Akira Nandan Pawan Video : ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూవీ జర్నీపై ఆయన కుమారుడు అకిరా నందన్ ఒక స్పెషల్ వీడియోను ఎడిట్ చేశాడు. తండ్రి కోసం తనయుడు స్వయంగా ఎడిట్ చేసిన ఆ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు.

ఇప్పుడా ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఆ వీడియోను షేర్ చేసిన రేణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. కొన్ని రోజుల క్రితమే అకిరా వాళ్ల నాన్న జర్నీ గురించి ఒక వీడియో ఎడిట్ చేశాడంటూ ఆమె క్యాప్షన్ పెట్టారు.

Read Also : Akira Nandan : నాన్న గెలుపుపై సోషల్ మీడియాలో పవన్ తనయుడు అకిరా స్పెషల్ పోస్ట్.. ఏం పెట్టాడంటే..

అయితే, పవన్ జర్నీ వీడియోను అకిరా షేర్ చేయమని తనకు చెప్పాడని రేణు దేశాయ్ తెలిపారు. అకిరా ఫోన్ చేసి నాన్న జర్నీ వీడియో షేర్ చేయమని చెప్పాడు. అకిరా ఆనందం కోసం ఇది షేర్ చేశాను. ‘‘నా లిటిల్ బాయ్‌కు వాళ్ల నాన్న అంటే అమితమైన ప్రేమ, తండ్రి జర్నీపై తనయుడి గర్వానికి ఇది నిదర్శనం’’ అని ఆమె క్యాప్షన్ పెట్టారు.

అకిరా పవన్‌ మూవీ జర్నీకి సంబంధించి అన్ని వీడియోలను ఒక వీడియోగా రూపొందించాడు. ఆ వీడియోలో అప్పట్లో ఖుషి నుంచి మొన్నటి భీమ్లా నాయక్‌ వరకు పవన్‌ డైలాగ్స్, మరెన్నో సన్నివేశాలను కలిపి వీడియోను అద్భుతంగా ఎడిట్ చేశాడు అకిరా. వీడియోను చూస్తుంటే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. అంత బాగా ఎడిట్ చేశాడంటూ పవన్ అభిమానులు సైతం మెచ్చుకుంటున్నారు.

తండ్రి విజయాన్ని ఆకాంక్షిస్తూ అకిరా ఈ వీడియో ఎడిట్‌ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. పవన్‌ మూవీ జర్నీ వీడియోని చూసిన నెటిజన్లు కూడా అకిరాకు పవన్ అంటే ఎంత ప్రేమో కదా అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Read Also : Chandrababu – Akira Nandan : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ తనయుడు.. జనసేన ఆఫీస్‌లో గెలుపు సంబరాలు.. ఫోటోలు వైరల్..