Akira Nandan : నాన్నతో అకిరా నందన్.. కొడుకును కూడా పుణ్య క్షేత్రాల యాత్రకు తీసుకెళ్లిన డిప్యూటీ సీఎం.. అకిరా గడ్డం లుక్ వైరల్..
పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి నేడు శ్రీకారం చుట్టారు.

Akira Nandan went with Pawan Kalyan New Look goes Viral
Akira Nandan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటాడు. ఒక్క ఫోటో బయటకు వచ్చినా వైరల్ అవ్వాల్సిందే. అకిరా ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పవన్ ఏపీ ఎన్నికల్లో గెలిచిన దగ్గర్నుంచి అకిరా ఎక్కువగా పవన్ తో కలిసి కనిపిస్తున్నాడు. తాజాగా మరోసారి అకిరా నందన్ పవన్ కళ్యాణ్ తో కలిసి కనిపించారు.
Also Read : Chiranjeevi : చిరంజీవి సరదాగా చేసిన కామెంట్స్ పై విమర్శలు.. వారసుడు కావాలని కోరుకోవడంతో..
పవన్ కళ్యాణ్ కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి నేడు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ముందు కేరళ వెళ్లి కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కళ్యాణ్ తో పాటు, ఆయన తనయుడు అకీరా నందన్, పవన్ క్లోజ్ ఫ్రెండ్, టీటీడీ సభ్యుడు ఆనందసాయి కూడా పాల్గొన్నారు. దీంతో పవన్ తో అకిరా ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
జనసేన సోషల్ మీడియా అధికారికంగా పవన్, అకిరా అగస్త్య మహర్షి ఆలయంలో ప్రదక్షిణలు, పూజలు చేసిన వీడియోని అధికారికంగా షేర్ చేసారు. ఇక అకిరా – పవన్ కలిసి ఉన్న ఫోటో వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అకిరా ఫుల్ గడ్డం, జుట్టు బాగా పెంచుకొని, తండ్రి లాగే పంచ, కుర్తా వేసుకొని సరికొత్త లుక్ లో కనపడ్డాడు. అకిరా కొత్త లుక్ అదిరింది అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ లుక్ లో అకిరా హీరోగా ఎంట్రీ ఇస్తే అదిరిపోతుంది అంటున్నారు.
Also Read : Vishwak Sen : విశ్వక్ సేన్ ఆ జానర్ లో అసలు సినిమానే చెయ్యడు అంట.. ఎందుకో తెలుసా? ఇలా కూడా ఉంటారా?
అయితే గతంలో రేణు దేశాయ్ అకిరా హీరోగా రాడు, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడేమో అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. మరి అకిరా హీరో అవుతాడా, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.