Vishwak Sen : విశ్వక్ సేన్ ఆ జానర్ లో అసలు సినిమానే చెయ్యడు అంట.. ఎందుకో తెలుసా? ఇలా కూడా ఉంటారా?
తాజాగా నేడు విశ్వక్ మీడియాతో మాట్లాడగా..

Vishwak Sen Comments on his Movie Genres
Vishwak Sen : యువ హీరో విశ్వక్ సేన్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. హిట్స్ కొడుతున్నాడు. ప్రమోషన్స్ లో ఫుల్ స్వింగ్ లో పాల్గొంటాడు. రెగ్యులర్ గా వార్తల్లో నిలుస్తాడు. త్వరలో విశ్వక్ లైలా సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా ‘లైలా’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.
లైలా సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా నేడు విశ్వక్ మీడియాతో మాట్లాడగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. విశ్వక్ కమర్షియల్ తో పాటు ప్రయోగాత్మక సినిమాలు కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలో అన్ని రకాలు ట్రై చేస్తున్నారు హారర్ జానర్ ఎందుకు ట్రై చెయ్యట్లేదు అనే ప్రశ్న ఎదురైంది.
Also Read : Saaree Trailer : ఆర్జీవీ ‘శారీ’ ట్రైలర్ వచ్చేసింది.. రిలీజ్ ఎప్పుడంటే.. బ్యూటీ సైకో థ్రిల్లర్..
దీనికి విశ్వక్ సేన్ సమాధానమిస్తూ.. నేను హారర్ జానర్ సినిమాలు చేయను. అసలు ఫ్యూచర్ లో కూడా హారర్ జానర్ సినిమాలు ఎప్పటికి చేయను. ఎందుకంటే నేను హారర్ కి భయపడను కాబట్టి. అందరూ చాలా భయపడ్డాం అనే సినిమాలకు కూడా నేనొక్కడ్నే వెళ్లి చూసొచ్చాను. అసలు హారర్ సినిమాలకు, సౌండ్స్ కి నేను భయపడను. ఊరికి చివర ఒక విల్లాలో నన్నొక్కడ్ని వదిలేసి హారర్ సౌండ్స్ పెట్టినా సైలెంట్ గా పడుకుంటాను తప్ప భయపడను. స్మశానంలో కూడా నేను హ్యాపీగా పడుకుంటాను. ఒక దయ్యం మనిషిని చంపింది అని రియాలిటీలో లేదు. అందుకే నేను భయపడను. నేను భయపడనప్పుడు, హారర్ భయం తెలియనప్పుడు నేను ఆ జానర్ సినిమా చేయలేను అని తెలిపారు.
అయితే విశ్వక్ డైరెక్టర్ కూడా కావడంతో మరి మీరు భయపడట్లేదు మీరే దర్శకుడిగా హారర్ సినిమా తీసి భయపెట్టొచ్చు కదా అని అడిగినా దానికి కూడా నేను చేయను అనే సమాధానం ఇచ్చారు. దీంతో ఎన్ని రకాల జానర్స్ లో విశ్వక్ సినిమాలు చేసినా హారర్ జానర్లో మాత్రం చేయడు అని క్లారిటీ వచ్చేసింది.