Lenin First Single: అఖిల్ ‘లెనిన్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్.. అప్డేట్ ఇచ్చిన మేకర్స్
అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న ‘లెనిన్’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్(Lenin First Single) రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Akkineni Akhil Lenin movie first song release update.
- అఖిల్ హీరోగా ‘లెనిన్’ మూవీ
- న్యూస్ ఇయర్ సందర్బంగా సాంగ్ అప్డేట్
- అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ ఖుషి
Lenin First Single: అఖిల్ అక్కినేని హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’. దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ లో లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లెనిన్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ (Lenin First Single)ను విడుదల చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ పాటను జనవరి 5న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో, అక్కినేని అఖిల్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Nidhhi Agerwal: అంతా వీరమల్లు తరువాతే.. ఏకంగా మూడు సినిమాలు.. పవన్ సినిమాపై నిధి కామెంట్స్

Akkineni Akhil Lenin movie first song release update.
