Lucifer Remake: మెగాస్టార్ చెల్లిగా అక్కినేని అమల?

సినిమాలో ఏదైనా క్రేజీ కాంబినేషన్ లేదంటే కాస్త ఇంట్రస్టింగ్ విషయం ఉందంటే సహజంగానే ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి మొదలవుతుంది. అందుకే దాదాపుగా మేకర్స్ అంతా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చేందుకు ఇష్టపడుతున్నారు.

Lucifer Remake: మెగాస్టార్ చెల్లిగా అక్కినేని అమల?

Lucifer Remake

Updated On : July 3, 2021 / 11:25 PM IST

Lucifer Remake: సినిమాలో ఏదైనా క్రేజీ కాంబినేషన్ లేదంటే కాస్త ఇంట్రస్టింగ్ విషయం ఉందంటే సహజంగానే ప్రేక్షకులలో సినిమా పట్ల ఆసక్తి మొదలవుతుంది. అందుకే దాదాపుగా మేకర్స్ అంతా ఏదో ఒక కొత్త అంశాన్ని తెరమీదకి తెచ్చేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పటికే అలనాటి హీరోయిన్స్ ను మరోసారి వెండితెర మీదకి తెచ్చే ట్రెండ్ కొనసాగుతున్న తరుణంలో అక్కినేని అమల మరో క్రేజీ ప్రాజెక్టులో నటించనుందని ఇప్పుడు ప్రచారం ఒకటి మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మలయాళ లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేసే సన్నాహాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా స్క్రిప్ట్ కూడా సిద్ధం చేయగా ప్రస్తుతం క్యాస్టింగ్ పనిలో ఉన్నారు. కాగా ఈ సినిమాలో చిరుకి చెల్లిగా ప్రాధాన్యత కలిగిన పాత్ర ఒకటి ఉంది. ఈ పాత్ర కోసం అక్కినేని అమలతో చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో ఓ ప్రచారం జరుగుతుంది.

గతంలో అమల చిరు సరసన రాజా విక్రమార్క సినిమాలో హీరోయిన్ గా నటించగా ఇప్పుడు ఇలా చెల్లి పాత్రలో కనిపించనుండడంతో ఆసక్తిగా మారింది. ఇందులో కూడా తన తండ్రిని తనకు దూరం చేస్తున్నాడని హీరో పాత్రపై ద్వేషంతో రగిలిపోతూ.. చివరికి హీరో సాయం కోరే ఎమోషనల్ పాత్రలో అక్కినేని అమల కనిపించడం ఎలా ఉంటుందా అని అటు అక్కినేని, ఇటు మెగా అభిమానులలో క్యూరియాసిటీ మొదలైంది. అయితే.. ప్రస్తుతానికి యూనిట్ నుండి ఈ విషయంపై అధికారిక వివరణ రాలేదు.