మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు.. ముఖ్య అతిథిగా బిగ్ బీ: నాగార్జున ప్రకటన

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వస్తారని చెప్పారు.

మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్‌ అవార్డు.. ముఖ్య అతిథిగా బిగ్ బీ: నాగార్జున ప్రకటన

Akkineni Nagarjuna Announces ANR Award 2024 to Megastar Chiranjeevi

Updated On : September 20, 2024 / 6:57 PM IST

ఈ ఏడాది ఏఎన్నార్‌ అవార్డును మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వనున్నట్టు హీరో అక్కినేని నాగార్జున ప్రకటించారు. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా జరిగిన ఈవెంట్​లో నాగార్జున ఈ ప్రకటన చేశారు. వచ్చేనెల 28న చిరంజీవికి ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వస్తారని చెప్పారు.

కాగా, అక్కినేని నాగేశ్వర రావు శత జయంతి సందర్భంగా చిరంజీవి స్పందించారు. లెజెండరీ ఏఎన్ఆర్‌ని స్మరించుకుంటున్నానని చెప్పారు. అలనాటి గొప్ప నటులలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరని చెప్పారు.

నటనా మేధావి, సినీ రంగానికి చెందిన ప్రముఖుడు, ఏఎన్నార్ చిరస్మరణీయమైన ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో, మనస్సుల్లో చిరస్మరణీయంగా ఉంటాయని తెలిపారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని చెప్పారు. ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం, అదృష్టం తనకు దక్కాయని అన్నారు.

Jani Master : లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్ట‌ర్‌కు షాక్‌.. 14 రోజుల జ్యుడిషియ‌ల్ రిమాండ్‌