Akkineni Family : మన హీరోల ఫ్యామిలీ అంతా కలిసి కనపడటం అరుదు. ఏదో ఫ్యామిలీ ఫంక్షన్, ఈవెంట్స్ లో తప్ప ఫ్యామిలిలో ఉన్న నటీనటులు, ప్రముఖులు అందరూ కలిసి ఒకే చోట కనడపడాలంటే అరుదుగా జరుగుతుంది. తాజాగా అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకేచోట కలిసి కనపడి అభిమానులకు ట్రీట్ ఇచ్చారు. నిన్న అక్కినేని నాగేశ్వరరావు 100వ జయంతి కావడంతో పలు వేడుకలు నిర్వహించారు.
ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ 100వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏఎన్నార్ ఫిలిం ఫెస్టివల్, పోస్టల్ స్టాంప్ రిలీజ్, ఏఎన్నార్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖులు, పలువురు అభిమానులు హాజరయ్యారు.
ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీ అంతా కూడా వచ్చారు. అక్కినేని వెంకట్, నాగార్జున, నాగ సుశీల, అమల, నాగ చైతన్య, సుప్రియ, అఖిల్, సుమంత్, సుశాంత్, అక్కినేని మనవళ్లు, మనవరాళ్లు.. ఇలా ఫ్యామిలీ మొత్తం ఈ ఈవెంట్ కి హాజరైంది. దీంతో అక్కినేని అభిమానుల కోసం ఫ్యామిలీ అంతా కలిసి ఫొటోలు దిగారు. అలాగే అక్కినేని వారసులు, అక్కినేని హీరోలు కూడా కలిసి ఫొటోలు దిగారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఫ్యామిలీ అందర్నీ ఒకే చోట చూసి అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.