అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ – ఫస్ట్‌లుక్

రంజిత్ తివారి దర్శకత్వంలో అక్ష‌య్ కుమార్‌ హీరోగా నటించనున్న ‘వెల్ బోటమ్’ ఫస్ట్‌లుక్ విడుదల..

  • Published By: sekhar ,Published On : November 11, 2019 / 06:58 AM IST
అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ – ఫస్ట్‌లుక్

Updated On : November 11, 2019 / 6:58 AM IST

రంజిత్ తివారి దర్శకత్వంలో అక్ష‌య్ కుమార్‌ హీరోగా నటించనున్న ‘వెల్ బోటమ్’ ఫస్ట్‌లుక్ విడుదల..

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్‌ వరసగా సినిమాలు లైన్లో పెడుతున్నాడు. మిగతా హీరోలు ఏడాదికి ఒక‌టో, రెండో సినిమాలు చేస్తే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో అక్ష‌య్ తన దైన స్పీడుతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే ‘హౌస్‌ఫుల్ 4’ తో ప్రేక్షకులను పలకరించిన అక్షయ్.. ‘గుడ్‌న్యూస్’, ‘సూర్యవంశీ’, ‘లక్ష్మీబాంబ్’, ‘పృథ్వీరాజ్’, ‘బచ్చన్ పాండే’ సినిమాలు చేస్తున్నాడు.

రీసెంట్‌గా మరో సినిమా ప్రకటించాడు. అక్ష‌య్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా ‘బెల్ బాట‌మ్‌’.. రంజిత్ తివారి ద‌ర్శ‌కుడు.. టైటిల్, ఫస్ట్‌లుక్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు అక్షయ్. 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగే స్పై థ్రిల్ల‌ర్‌గా సినిమా తెర‌కెక్క‌నుంది. అక్ష‌య్ సినిమాను అనౌన్స్ చేయ‌గానే.. ఇది కన్నడ ‘బెల్ బోటమ్’కి రీమేక్ అనే ప్రచారం మొదలైంది.

Read Also : ‘సైకో’ డిసెంబర్ 27న రానున్నాడు

దీంతో త‌న సినిమా దేనికీ రీమేక్ కాద‌ని, నిజ సంఘ‌ట‌న‌లను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్టు అక్షయ్ రిప్లై ఇచ్చాడు. వషూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ నిర్మిస్తున్న ‘బెల్ బాట‌మ్‌’ జ‌న‌వ‌రి 22, 2021లో విడుద‌ల చేయ‌నున్న‌ారు.