Akshay Kumar : వరుస ఫ్లాపులు.. రెమ్యునరేషన్ తగ్గించుకున్న అక్షయ్ కుమార్.. కానీ..
తాజాగా రిలీజ్ అయిన ‘రక్షాబంధన్’ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో అక్షయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడట. దాదాపు అతని రెమ్యునరేషన్ వచ్చే సినిమాలకి సగానికి పైగా తగ్గించుకుంటున్నాడని............

Akshay Kumar reduce his remunaration
Akshay Kumar : ఇటీవల బాలీవుడ్ లో వరుసగా పరాజయాలు వస్తున్న సంగతి తెలిసిందే. వరస పరాజయాలతో బాలీవుడ్ ఇండస్ట్రీ నష్టాల్లో కురుకుపోతుంది. సినిమా నిర్వహణలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉంటాయి. బాలీవుడ్ లో అయితే ఇది మరీ దారుణంగా ఉంటుంది. అక్కడి స్టార్ హీరోలు ఒక్కో సినిమాకి 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా వాళ్ళ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇది నిర్మాతలకి భారంగా మారింది.
అయితే గతంలో అమీర్ ఖాన్ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో తన రెమ్యునరేషన్ కొంచెం తగ్గించుకొని సినిమాకి లాభాలు వస్తే దాంట్లో వాటా తీసుకునేవాడు. దీనివల్ల కాస్తో కూస్తో నిర్మాతకి బెనిఫిట్ అయ్యేది. తాజాగా ఈ బాటలో అక్షయ్ కుమార్ చేరాడు. అక్షయ్ నటించిన గత నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇండియాలో అత్యధికంగా ట్యాక్స్ పే చేసేవాళ్ళల్లో అక్షయ్ ఒకరు. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు అతని రెమ్యునరేషన్, అతని సంపాదన ఎంత ఉంటుందో. ఒక్కో సినిమాకి అక్షయ్ దాదాపు 70 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటాడని సమాచారం.
తాజాగా రిలీజ్ అయిన ‘రక్షాబంధన్’ సినిమా కూడా ఫ్లాప్ అవ్వడంతో అక్షయ్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడట. దాదాపు అతని రెమ్యునరేషన్ వచ్చే సినిమాలకి సగానికి పైగా తగ్గించుకుంటున్నాడని ప్రకటించినట్టు సమాచారం. అయితే తన రెమ్యునరేషన్ తగ్గించుకున్నా సినిమా హిట్ అయి లాభాలు వస్తే మాత్రం వాటా ఇవ్వాలంటూ మెలిక పెట్టాడు. దీంతో నిర్మాతలు అక్షయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దీనివల్ల సినిమా వ్యయం చాలా తగ్గుతుందని భావిస్తున్నారు. మరి అక్షయ్ లాగే మిగిలిన స్టార్ హీరోలు కూడా ఇదే బాటలో నడిచి బాలీవుడ్ కి హిట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం నష్టాలు తగ్గిస్తారేమో చూడాలి.