Selfiee Collections : బాలీవుడ్ లో మరో డిజాస్టర్.. సెల్ఫీ సినిమాకు అక్షయ్ కుమార్ కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్
అక్షయ్ సెల్ఫీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అసలు సినిమా రిలీజ్ కి ముందే ఎలాంటి హైప్ లేదు. ఇక సినిమా రిలీజయ్యాక థియేటర్స్ లో జనాలు కూడా లేరు. స్టార్ హీరోల సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయి. కానీ సెల్ఫీ సినిమాకి మొదటి రోజు..................

Akshay kumar Selfiee movie gets disaster talk and very low Collections
Selfiee Collections : గత రెండేళ్లుగా బాలీవుడ్ కి హిట్స్ అప్పుడప్పుడు వచ్చే చుట్టాల్లా పలకరించి వెళ్లిపోతున్నాయి. దీనస్థితిలో ఉన్న బాలీవుడ్ కి ఇటీవల షారుఖ్ పఠాన్ సినిమాతో ఊపిరి పోశాడు. రాక రాక చాలా రోజుల తర్వాత ఒక పెద్ద హిట్ రావడంతో బాలీవుడ్ అంతా కలిసి పఠాన్ ని ప్రమోట్ చేసి బాలీవుడ్ ఏమి పడిపోలేదు, బాలీవుడ్ కి ఏమి కాలేదు అంటూ హంగామా చేశారు. వచ్చిన సినిమా వచ్చినట్టు ఫ్లాప్ అవుతుంటే బాలీవుడ్ వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు పఠాన్ వచ్చి విజయం సాధించడంతో ఇక బాలీవుడ్ ఫేట్ మారిపోయింది అంటూ హడావిడి చేశారు.
కానీ పరిస్థితి ఏమి మారలేదు. పఠాన్ సినిమా తర్వాత వచ్చిన రెండు పెద్ద సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో మళ్ళీ బాలీవుడ్ పాత స్థితిలోకి వచ్చేసింది. పఠాన్ తర్వాత కార్తీక్ ఆర్యన్ షెహజాదా సినిమాతో వచ్చారు. ఈ సినిమా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ అలవైకుంఠపురంలో సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. కానీ షెహజాదా అట్టర్ ఫ్లాప్ గా మిగిలింది. ఇక తాజాగా అక్షయ్ కుమార్ సెల్ఫీ మూవీ రిలీజయింది. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ కలిసి నటించిన సెల్ఫీ మూవీ శుక్రవారం ఫిబ్రవరి 24న రిలీజయింది.
సెల్ఫీ సినిమా కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్ కావడం విశేషం. కరోనా రావడంతో హోల్డ్ లో ఉన్న అక్షయ్ కుమార్ సినిమాలన్నీ వరుసగా 2022 లో రిలీజయ్యాయి. స్టార్ హీరో అయినా ఒకే ఇయర్ లో ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేశాడు. అయితే ఈ ఆరు సినిమాలు ఫ్లాప్ అవ్వడం గమనార్హం. దీంతో అక్షయ్ సెల్ఫీ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ అసలు సినిమా రిలీజ్ కి ముందే ఎలాంటి హైప్ లేదు. ఇక సినిమా రిలీజయ్యాక థియేటర్స్ లో జనాలు కూడా లేరు. స్టార్ హీరోల సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ అయినా వస్తాయి. కానీ సెల్ఫీ సినిమాకి మొదటి రోజు మొత్తంగా 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇది ఇటీవల వచ్చిన అక్షయ్ ఫ్లాప్ సినిమాల కంటే కూడా తక్కువ ఓపెనింగ్స్. టైర్ 2 హీరోలకు కూడా ఓపెనింగ్స్ ఇంతకంటే బాగా వస్తున్న సమయంలో అక్షయ్ సినిమాకు ఇలా కలెక్షన్స్ రావడంతో బాలీవుడ్ ఆశ్చర్యపోయింది. ఇక అక్షయ్ అభిమానులు మరో ఫ్లాప్ పడినందుకు నిరాశ చెందుతున్నారు.
Pawan Kalyan : చరణ్ విజయాలపై పవన్ కళ్యాణ్ స్పెషల్ ప్రెస్ నోట్..
పఠాన్ సినిమా హిట్ అయింది అనే బాలీవుడ్ ఆనందం కొద్ది రోజులు కూడా లేకముందే వరుసగా ఇద్దరు స్టార్ హీరోలకు రెండు ఫ్లాప్స్ పడటంతో మళ్ళీ బాలీవుడ్ ఆలోచనలో పడింది. అయితే ఆ రెండు సినిమాలు కూడా రీమేక్స్ అవ్వడం విశేషం. ఓటీటీ సూపర్ ఫామ్ లో ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా రీమేక్స్ తీస్తుంటే ఇలాగే అవుతుంది అంటున్నారు. రీమేక్ సినిమా కాకపోతే సినిమా ఫ్లాప్ అయినా కనీసం కలెక్షన్స్, ఓపెనింగ్స్ అయినా వచ్చేవని భావిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాలని ఓటీటీలో చూసేయడంతో రీమేక్ సినిమాపై ఎవ్వరూ అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ కి ఇంకో హిట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. మరి బాలీవుడ్ కి ఈ ఫేట్ ఎప్పుడు మారుతూందో చూడాలి.
#Selfiee has a disastrous Day 1… Sends shock waves throughout the industry… One of the lowest starts for a film that has several prominent names attached to it… Fri ₹ 2.55 cr+. #India biz. pic.twitter.com/juk8aCCvZq
— taran adarsh (@taran_adarsh) February 25, 2023